హీరోయిన్ కేథరిన్ సోదరుడి ఆత్మహత్య | heroine catherine tresa's brother christopher commits suicide in Bangalore | Sakshi
Sakshi News home page

హీరోయిన్ కేథరిన్ సోదరుడి ఆత్మహత్య

Dec 12 2014 1:16 PM | Updated on Nov 6 2018 7:56 PM

హీరోయిన్ కేథరిన్  సోదరుడి ఆత్మహత్య - Sakshi

హీరోయిన్ కేథరిన్ సోదరుడి ఆత్మహత్య

'ఇద్దరమ్మాయిలు' చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ కేథరిన్ థెరిసా సోదరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

'ఇద్దరమ్మాయిలు' చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ కేథరిన్ థెరిసా సోదరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆమె సోదరుడు క్రిస్టోఫర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేథరిన్ సోదరుడు క్రిస్టోఫర్.. బుధవారం సాయంత్రం బెంగళూరులోని మురుగేష్ పాలియాలోని తన గదిలో కిటికీకి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.  సోదరుడి మరణవార్త విన్న కేథరిన్ ....చెన్నై నుంచి హుటాహుటీన బెంగళూరు బయల్దేరి వెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేసి.. క్రిస్టోఫర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించి దర్యాప్తు చేపట్టారు.

మరోవైపు క్రిస్టోఫర్కు కుటుంబంతో సరైన సంబంధాలు లేనట్లు సమాచారం. అతడు గత కొంతకాలంగా విడిగానే ఉంటూ చదువుకుంటున్నాడు. అయితే  క్రిస్టోఫర్ ఆర్థిక ఇబ్బందులు కారణంగానే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు అతని స్నేహితులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement