కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్న నటి.. | Heroien Ruhi singh actiong in Bongu movie | Sakshi
Sakshi News home page

కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్న నటి..

Apr 25 2017 7:10 PM | Updated on Sep 5 2017 9:40 AM

కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్న నటి..

కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్న నటి..

సినిమాల్లో భామలు నటనపరంగా ఆకట్టుకోలేకపోయినా అందాలను ప్రదర్శించి మార్కెట్‌ను దక్కించుకుంటారు.

సినిమాల్లో పేరు ప్రతిష్టలు పొందాలని వచ్చే భామలు నటనపరంగా ఆకట్టుకోలేకపోయినా అందాలను ప్రదర్శించి మార్కెట్‌ను దక్కించుకుంటారు. ఆ విధంగా క్యాలాండర్‌ గర్ల్స్, ఇష్క్‌ ఫర్‌ ఎవర్‌ వంటి హిందీ చిత్రాలలో నటించిన బ్యూటీ రుహి సింగ్‌. ఈమె చదురంగ వేటై్ట హీరో నడ్డీ నటరాజన్‌ నటించిన ‘బోంగు’ చిత్రంలో నాయకిగా నటించింది. హిందీలో నటించిన  రుహి సింగ్ చిత్రాలు ఏవీ అంతగా విజయం సాధించకపోవడంతో మార్కెట్‌లో ఇంకా వెనుకంజలోనే ఉన్నది‌. దీంతో అమ్మడు తన గుర్తింపు కోసం అప్పుడప్పుడు ఒంపు సొంపులను చూపుతూ ఫోటోలను విడుదల చేసి కలకలం సృష్టిస్తూ వస్తోంది.

ప్రస్తుతం తమిళంలో ఎంట్రీ ఇస్తున్న ఈ సుందరి మార్కెట్‌ను చేజిక్కించుకోవడం కోసం బోంగు సినిమాలోని పాటల సన్నివేశాలలో విచ్చల విడిగా తన అంద చందాలను ఆరబోసి నటించింది. అదే సమయంలో హిందీలో తన పేరు ప్రసిద్ధి చెందడం కోసం తాజాగా ఫోటో ఆల్బమ్‌ను విడుదల చేసింది. వేసవి ఎండల తాపాన్ని తగ్గించే విధంగా స్విమ్మింగ్‌ ఫూల్‌లో  జలకాలాడుతున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామం పేజీలో రుహి సింగ్ అప్‌లోడ్‌ చేసింది ‌. అమ్మడు విడదల చేసిన తన బికినీ ఫోటోలు కుర్రకారు నరనరాలను జువ్వున లాగేస్తూ మార్కెట్‌లో కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తూ రచ్చ రచ్చ చేస్తున్నాయి.

 

Advertisement

పోల్

Advertisement