హీరో రాజశేఖర్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు!

Hero Rajasekhar Driving License Revoked - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హీరో రాజశేఖర్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దయింది. రవాణాశాఖ ఆయన డ్రైవింగ్‌ లైసెన్స్‌ను 6 నెలలపాటు రద్దు చేసింది. గతనెల 12న ఔటర్‌ రింగ్‌ రోడ్డు పెద్ద గోల్కొండ వద్ద ఆయన కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఆ సమయంలో రాజశేఖరేకారు నడిపారు.  ఈ కేసులోనే రాజశేఖర్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ను అధికారులు రద్దు చేసినట్లుగా సమాచారం. 2017 అక్టోబర్‌లోనూ పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ఓ కారును రాజశేఖర్‌ వాహనం ఢీకొట్టిన సంగతి తెలిసిందే. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాజశేఖర్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కాలపరిమితి 2017 లోనే ముగిసింది. అయినా, ఆయన దాన్ని రెన్యువల్‌ చేసుకోలేదు. దీనికితోడు నిర్లక్ష్యంగా కారు నడుపుతూ వరుసగా ప్రమాదాలకు కారణమవుతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top