ఇదో వెరైటీ

ఇదో వెరైటీ


అజయ్‌ హీరోగా సుధాకర్‌ వినుకొండ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మిస్టర్‌ యోగి’. జవాన్‌ అండ్‌ కాస్పియన్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై జె.వై. రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని హీరో నవీన్‌చంద్ర విడుదల చేశారు. సుధాకర్‌ వినుకొండ మాట్లాడుతూ– ‘‘ఇదొక వెరైటీ స్టోరీ. ఈ కథకు, టైటిల్‌కు విజయ్‌ కరెక్ట్‌గా యాప్ట్‌ అయ్యాడు. కిరణ్‌శంకర్‌ పాటలు అద్భుతంగా ఉంటాయి.



ఈ నెల 24న రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది. మా సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని విడుదల చేసిన నవీన్‌చంద్రగారికి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘మిస్టర్‌ యోగి’ కథేంటి అన్నది సస్పెన్స్‌. ఇటువంటి కథా బలమున్న సినిమాలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు అజయ్‌. ఈ చిత్రానికి కెమెరా: దిలీప్‌ కుమార్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: సుధాకర్‌ రావు కులకర్ణి, కిరణ్‌ సిరిగిరి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top