మన్మథుడు-2 పై క్లారిటీ ఇచ్చిన నాగార్జున

Hero Nagarjuna Given Clarity About His Movie Manmadhudu 2 - Sakshi

టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘మన్మథుడు-2’. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. కామెడీ ఎంటర్‌టైర్‌గా వస్తున్న ఈ సినిమాపై రోజురోజుకు ప్రేక్షకుల్లో హైప్‌ క్రియెట్‌ అవుతోంది. తాజాగా సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ గురువారం విడుదల చేసింది. ట్రైలర్‌ విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అయితే  ఈ సినిమా హాలీవుడ్‌ ‘వాట్‌ వుమెన్‌ వాంట్‌’ సినిమాకు రీమెక్‌ అంటూ రూమర్స్‌ వినిపిస్తున్న నేపథ్యంలో ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో హీరో నాగార్జున స్పష్టత ఇచ్చాడు.

‘మన్మథుడు-2 ఏ సినిమాకు సీక్వెల్‌ కాదు. కేవలం 2006లో వచ్చిన ఫ్రెంచ్‌ మూవీ (ప్రీట్‌ మొయి ట మెయిన్‌)కి రీమెక్‌. అయితే మన్మథుడు సినిమా నుంచి ప్రధాన పాత్రను తీసుకొన్నామ’ని నాగ్‌ క్లారిటీ ఇచ్చాడు . అంతేగాక ముందుగానే స్టూడియో కెనాల్‌ నుంచి రీమెక్‌ రైట్స్‌ తీసుకున్నామని తెలిపారు. చైతన్య భరద్వాజ్‌ సంగీతం అందించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top