విష్ణు టిక్‌టాక్‌ వీడియో.. అద్భుతః

Hero Manchu Vishnu Enter Into Tiktok - Sakshi

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా సెలబ్రిటీలంతా ఇంటికే పరిమితమయ్యారు. అనూహ్యంగా దొరికిన ఈ ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. అంతేకాకుండా వీలుచిక్కినప్పుడల్లా వెరైటీ వంటకాలు, ఆటలు, పాటలు, ప్రజలను చైతన్య పరిచేటటువంటి వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. అయితే ఎన్ని చేసినా ఈ లాక్‌డౌన్‌ సమయంలో తమ వృత్తిని తెగ మిస్సవుతున్నామని వారి అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆటగాళ్లు ఇండోర్‌ ప్రాక్టీస్‌ మొదలుపెడుతుండగా.. నటీనటులు సామాజిక మాధ్యమాల వేదికగా తమ నటవిశ్వరూపం ప్రదర్శించాలని భావిస్తున్నారు. 

తాజాగా టాలీవుడ్‌ హీరో మంచు విష్ణు టిక్‌టాక్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు టిక్‌టాక్‌లో కనిపించినప్పటికీ విష్ణు మాత్రం కనిపించలేదు. అయితే బుధవారం ‘`హలో టిక్‌టాక్! నేను వచ్చేశా. లెట్స్ హేవ్ ఫన్` అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా తన అభిమానులను అలరించాడానికి వెరైటీగా ఓ క్రియేటీవ్‌ వీడియోను రూపొందించి విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో చూపరులను తెగ ఆకట్టుకోవడంతో తెగ వైరల్‌ అవుతోంది. ఆ వీడియో రిలీజ్‌ చేసిన 24 గంటల వ్యవధిలోనే 4.5 మిలియన్‌ వ్యూస్‌తో పాటు వేల లైక్స్‌ అందుకుంది. ‘టిక్‌టాక్‌లో విష్ణు ఎంట్రీ మామూలుగా లేదు కదా’అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 

చదవండి:
మరింత మంచి నటి అవుతా!
ప్రేమను పంచాలి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top