బ్యాడ్మింటన్‌లో తలపడనున్న హీరో హీరోయిన్లు | Hero heroines participate badminton sports | Sakshi
Sakshi News home page

బ్యాడ్మింటన్‌లో తలపడనున్న హీరో హీరోయిన్లు

Jun 28 2014 1:30 AM | Updated on Sep 2 2017 9:27 AM

బ్యాడ్మింటన్‌లో తలపడనున్న హీరో హీరోయిన్లు

బ్యాడ్మింటన్‌లో తలపడనున్న హీరో హీరోయిన్లు

సినీ తారలు సినిమాలతోనే కాకుండా క్రీడలతోను ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయడానికి ముందుకొస్తున్నారు.

 సినీ తారలు సినిమాలతోనే కాకుండా క్రీడలతోను ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయడానికి ముందుకొస్తున్నారు. ఆ మధ్య సెలిబ్రిటీ క్రికెట్ లీగ్‌లతో కాలక్షేపాన్నిచ్చిన సినీ తారలు ఇప్పుడు బ్యాడ్మింటన్ క్రీడతో ఎంజాయ్‌మెంట్‌ను కలగజేయనున్నారు. క్రికెట్ క్రీడలో హీరోలు మాత్రమే పాల్గొని ప్రేక్షకుల్ని అలరించారు. ఈ సారి బ్యాడ్మింటన్ క్రీడా పోటీల్లో యువ హీరోలతోపాటు హీరోయిన్లు తలపడి వీక్షకుల్ని జోష్‌లో ముంచెత్తడానికి రెడీ అవుతున్నారు.

సినిమాల్లో ఎప్పుడూ హీరోలదే పైచేయిగా ఉంటుంది. ఇప్పుడీ బ్యాడ్మింటన్ క్రీడలో హీరోలతో పోటాపోటీకి హీరోయిన్లు ఉత్సాహం చూపిస్తున్నారు. ఆగస్ట్‌లో జరగనున్న తారల బ్యాడ్మింటన్ క్రీడా పోటీల్లో పాల్గొనడానికి 50 మందికి పైగా నటీనటులు రెడీ అవుతున్నారు. వీరిలో ఆర్య, జయం రవి, శివ, ఆది, నరేన్, భరత్, వెంకట్ ప్రభు, ఆది తదితర హీరోలున్నారు.

ఓవియా, రాయ్ లక్ష్మీ, రూపా మంజరి, అమలాపాల్, జనని అయ్యర్ తదితర హీరోయిన్లు ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశారు. చెన్నై నెహ్రూ స్టేడియంలో జరగనున్న ఈ తారల బ్యాడ్మింటన్ పోటీలను బ్యాడ్మింటన్ కళాకారుల సంక్షేమం కోసం ఇండియన్ బ్యాడ్మింటన్ సెలబ్రిటీ లీగ్ అనే సంస్థ నిర్వహించనుంది. దీంతో జూలై నుంచి మన అందాల తారలు ప్రాక్టీస్ మొదలెట్టనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement