అరవింద్‌కృష్ణ యాక్షన్. | Hero Aravind Krishna new film | Sakshi
Sakshi News home page

అరవింద్‌కృష్ణ యాక్షన్.

Aug 12 2013 12:22 AM | Updated on Sep 1 2017 9:47 PM

అరవింద్‌కృష్ణ యాక్షన్.

అరవింద్‌కృష్ణ యాక్షన్.

అరవింద్‌కృష్ణ కథానాయకునిగా ఓ చిత్రం రూపొందుతోంది. అవంతిక, జాహ్నవి కథానాయికలు. భార్గవ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఎం.రంగారావు నిర్మాత.

 అరవింద్‌కృష్ణ కథానాయకునిగా ఓ చిత్రం రూపొందుతోంది. అవంతిక, జాహ్నవి కథానాయికలు. భార్గవ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఎం.రంగారావు నిర్మాత. ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి రమణరాజు కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత రంగారావు క్లాప్ ఇచ్చారు. కాశీ విశ్వనాథ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకూ చేయని మాస్ పాత్రను ఇందులో చేస్తున్నానని, కళాశాల నేపథ్యంలో సినిమా ఉంటుందని అరవింద్‌కృష్ణ చెప్పారు.
 
 ‘‘నాగరాజు సాహిత్యం ఈ చిత్రానికి ప్రధాన బలం. ఈ నెల 19 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. మూడు షెడ్యూళ్లను హైదరాబాద్ పరిసరాల్లో 45 రోజుల్లో పూర్తి చేస్తాం’’ అని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. మధునందన్, బెనర్జీ, రవిబాబు, కాశీవిశ్వనాథ్, ధన్‌రాజ్, తాగుబోతు రమేష్, కార్తీక్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: రాజ్ ఉండ్రమట్ల, సంగీతం: మైఖేల్ మక్కల్, కూర్పు: ధర్మేంద్ర, కళ: రాము. 
 

Advertisement
 
Advertisement
Advertisement