ఆ ఫస్ట్‌ పోస్టర్‌లో ఆమె ఎందుకు లేదంటే? | Here why Priyanka Chopra was dropped from Baywatch official pic | Sakshi
Sakshi News home page

ఆ ఫస్ట్‌ పోస్టర్‌లో ఆమె ఎందుకు లేదంటే?

May 25 2016 7:53 PM | Updated on Sep 4 2017 12:55 AM

ఆ ఫస్ట్‌ పోస్టర్‌లో ఆమె  ఎందుకు లేదంటే?

ఆ ఫస్ట్‌ పోస్టర్‌లో ఆమె ఎందుకు లేదంటే?

భారీ అంచనాల మధ్య హాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటోంది ప్రియాంక చోప్రా.

భారీ అంచనాల మధ్య హాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటోంది ప్రియాంక చోప్రా. ఆమె మొదటి హాలీవుడ్‌ చిత్రం 'బేవాచ్‌'. డ్వాయ్నె జాన్సన్‌, జాక్‌ ఎఫ్రాన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ముగిసింది. ఇటీవల ఫస్ట్ పోస్టర్‌ కూడా విడుదల చేశారు. కానీ ఈ పోస్టర్‌లో బాలీవుడ్ భామ ప్రియాంక లేకపోవడం ఆమె అభిమానుల్ని షాక్‌ గురిచేసింది.

'బేవాచ్‌' సినిమాలో ప్రియాంక నెగిటివ్‌ పాత్రలో విలన్‌గా కనిపిస్తుండటంతో ఆమెను ఫస్ట్ పోస్టర్‌లో చూపించలేదనే టాక్ వినిపించింది. ఈ ఊహాగానాలకు తెరదించుతూ ఈ చిత్ర యూనిట్‌ ప్రియాంక అభిమానుల్ని ఆనందంలో ముంచే విషయాన్ని తెలిపింది. ప్రియాంక కోసమే ఒక సెపరేట్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయనుందట. 'సినిమా ప్రమోషనల్‌ విషయంలో చిత్ర యూనిట్ ఒక ప్లాన్ ప్రకారం ముందుకువెళుతోంది. ప్రియాంకను యూనిట్‌ పెద్ద ఎత్తున లాంచ్ చేయాలని భావిస్తోంది. అందులోభాగంగా తదుపరి వచ్చే పోస్టర్‌లో ప్రియాంక మాత్రమే ఉంటుంది. ఆమె విలన్ పాత్ర పోషించడంతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు దక్కేలా ఈ పోస్టర్‌ను ప్లాన్ చేశారు' అని 'బేవాచ్‌'  చిత్రయూనిట్‌కు చెందిన విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement