తెనాలిలో "ఏంజెల్‌" | Hebah Patel open mobile store in tenali | Sakshi
Sakshi News home page

తెనాలిలో "ఏంజెల్‌"

Nov 18 2017 11:57 AM | Updated on Nov 18 2017 12:04 PM

Hebah Patel open mobile store in tenali - Sakshi - Sakshi

యువతతో సెల్ఫీ దిగుతున్న హెబ్బా

గలగల మాటలతో, గమ్మత్తయిన చూపులతో మురిపించే సినీ తార హెప్సిబా పటేల్‌ శుక్రవారం ఆంధ్రాప్యారిస్‌లో తళుక్కున మెరిసింది. ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఈ సుకుమారి బిస్కెట్‌ కలర్‌ డ్రస్‌తో వచ్చి యువత మనసులపై తియ్యని క్రీమ్‌ బిస్కెట్‌ వేసింది. తుమ్మెద రెక్కల్లాంటి కళ్లతో మాయ చేస్తూ పసందైన నవ్వులతో అందరినీ ఆకట్టుకుంది.  

తెనాలిఅర్బన్‌ : తెనాలి బోస్‌ రోడ్డులోని ఎస్‌బీఐ ఎదురు నూతనంగా ఏర్పాటు చేసిన బి న్యూ మొబైల్స్‌ షోరూంను శుక్రవారం హెబ్బాపటేల్‌ ప్రారంభించారు. తెనాలి పట్టణం రావడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు. ఆమె వచ్చిన సంగతి తెలుసుకున్న యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో షోరూం వద్దకు పెద్ద సంఖ్యలో యువత చేరుకున్నారు. ఆమెతో సెల్ఫీ దిగడానికి పోటీ పడ్డారు. యువతను ఆమె ఉత్సహపరుస్తూ సందడి చేశారు. ఆమె వెంట షోరూం నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement