'రహస్య' సినిమాను విడుదల చేయొద్దు | HC puts on hold release of film on Aarushi Talwar's killing | Sakshi
Sakshi News home page

'రహస్య' సినిమాను విడుదల చేయొద్దు

Published Sat, May 10 2014 5:14 PM | Last Updated on Sat, Sep 2 2017 7:11 AM

HC puts on hold release of film on Aarushi Talwar's killing

ముంబై: ఆరుషి తల్వార్ హత్యాకాండ కథ ఆధారంగా తెరకెక్కిన హిందీ చిత్రం 'రహస్య' విడుదలను బాంబే హైకోర్టు నిలిపివేసింది. జూన్ 13 వరకు ఈ సినిమాను విడుదల చేయవద్దంటూ జస్టిస్ వీఎం కనాడే, అనిల్ మీనన్లతో కూడిన బెంచ్ ఆదేశాలిచ్చింది. అయితే సినిమా మేకింగ్ ప్రొమోలు పదర్శించకుండా చూడాలన్న అభ్యర్థనను తిరస్కరించింది.

రహస్య  సినిమా విడుదల కాకుండా చూడాలన్న నుపుర్, రాజేష్ తల్వార్ అభ్యర్థన మేరకు ఈ ఆదేశాలిచ్చింది. వేసవి సెలవులు ముగిసిన తర్వాత జూన్ 13న తదుపరి విచారణ జరుపుతామని పేర్కొంది. సంచలనం సృష్టించిన ఆరుషి తల్వార్ హత్య కేసులో ఆమె తల్లిదండ్రులు దోషులుగా తేలడంతో వారికి జీవితఖైదు విధించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement
Advertisement