మహా వివాదం!

hansika lady oriented movie maha controversy - Sakshi

సౌత్‌లో కథానాయికగా మంచి పేరు తెచ్చుకున్న హన్సిక చిక్కుల్లో పడ్డారు. తాజాగా ఆమె ప్రధానపాత్ర పోషిస్తున్న లేడీ ఒరియంటెడ్‌ మూవీ ‘మహా’ వివాదంలో ఇరుక్కుంది. ఈ చిత్రం హన్సిక కెరీర్‌లో 50వది కావడం విశేషం. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌ను రిలీజ్‌ చేశారు. అందులో ఒక పోస్టర్‌లో కాషాయ వస్త్రాలు ధరించి హన్సిక ధూమపానం చేస్తున్న లుక్‌ ఒకటి. ఈ లుక్‌ హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉందని తమిళనాడు కోర్టులో కేసు నమోదైంది.

కోర్టు కూడా కేసును స్వీకరించినట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. మరి.. ఈ వివాదంపై ‘మహా’ చిత్రబృందం ఏ విధంగా స్పందించనుందన్న విషయం ఆసక్తికరంగా మారింది. యూఆర్‌ జమీల్‌ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం కానున్నారు. కరుణాకరన్, తంబి రామయ్య కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు జిబ్రాన్‌ స్వరకర్త. జిబ్రాన్‌ కెరీర్‌లో ఇది 25వ చిత్రం కావడం విశేషం. ఈ సంగతి ఇలా ఉంచితే..« ధూమపానం చేస్తున్న విజయ్‌ ‘సర్కార్‌’ చిత్ర పోస్టర్‌ కూడా వివాదంలో చిక్కుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top