'సెకండ్ హ్యాండ్ మొగుడు'తో హీరోయిన్ బోణీ | govinda's daughter tina ahuja debutes with "second hand husband" | Sakshi
Sakshi News home page

'సెకండ్ హ్యాండ్ మొగుడు'తో హీరోయిన్ బోణీ

Jun 19 2015 3:30 PM | Updated on Sep 3 2017 4:01 AM

'సెకండ్ హ్యాండ్ మొగుడు'తో హీరోయిన్ బోణీ

'సెకండ్ హ్యాండ్ మొగుడు'తో హీరోయిన్ బోణీ

గోవిందా కుమార్తె టీనా అహూజా త్వరలోనే తెరంగేట్రం చేస్తోంది. 'సెకండ్ హ్యాండ్ హజ్బెండ్' అనే సినిమాతో ఆమె బాలీవుడ్ రంగ ప్రవేశం చేస్తోంది.

చిత్ర విచిత్రమైన డాన్సులు, కామెడీ నిండిన డైలాగులతో దాదాపు రెండు మూడు దశాబ్దాల పాటు బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన గోవిందా కుమార్తె టీనా అహూజా త్వరలోనే తెరంగేట్రం చేస్తోంది. 'సెకండ్ హ్యాండ్ హజ్బెండ్' అనే సినిమాతో ఆమె బాలీవుడ్ రంగ ప్రవేశం చేస్తోంది. తన తండ్రి వారతస్వం కారణంగా తన మీద చాలా పెద్ద బాధ్యత ఉందని టీనా చెబుతోంది.

తన తొలి ప్రాజెక్టు గురించి ఒకవైపు ఎంతో ఉత్సుకతగాను, మరోవైపు భయంభయంగాను ఉందని తెలిపింది. సెకండ్ హ్యాండ్ హజ్బెండ్ సినిమాలో ఆమెతో పాటు ధర్మేంద్ర, జిప్పీ గ్రేవాల్ కూడా నటిస్తున్నారు. తొలి సినిమా చేసేందుకు ఎందుకు ఇంతకాలం వేచి చూశారని ప్రశ్నించగా, తానింకా సినీపరిశ్రమలోకి ప్రవేశించడానికి సిద్ధం కానప్పుడే తన గురించి మీడియాలో రాశారని.. నిజానికి 2013లోనే తాను సినిమాల్లోకి రావాల్సి ఉన్నా.. సాంకేతిక కారణాల వల్ల కుదరలేదని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement