మై స్వీట్‌ హార్ట్‌ | Gopicaran, Aishwarya Addala starrer entertainer 'netra'. | Sakshi
Sakshi News home page

మై స్వీట్‌ హార్ట్‌

Dec 19 2016 11:40 PM | Updated on Sep 4 2017 11:07 PM

మై స్వీట్‌ హార్ట్‌

మై స్వీట్‌ హార్ట్‌

గోపీచరణ్, ఐశ్వర్య అడ్డాల జంటగా నటించిన ఎంటర్‌టైనర్‌ ‘నేత్ర’. ‘మై స్వీట్‌ హార్ట్‌’ అన్నది ఉప శీర్షిక.

గోపీచరణ్, ఐశ్వర్య అడ్డాల జంటగా నటించిన ఎంటర్‌టైనర్‌ ‘నేత్ర’. ‘మై స్వీట్‌ హార్ట్‌’ అన్నది ఉప శీర్షిక. రెడ్డెం యాదకుమార్‌ దర్శకత్వంలో పీరికట్ల రాము నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘లవ్, హారర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ‘వైజాగ్‌’ సత్యానంద్‌గారు కీలక పాత్ర చేశారు. వారి అబ్బాయి ఈ చిత్రం ద్వారా పరిచయమవుతున్నారు. ఉదయ్‌ నాగ్‌ రతన్‌ స్వరపరచిన పాటలకు మంచి స్పందన వస్తోంది. నేపథ్య సంగీతం సినిమాను మరో లెవల్‌కి తీసుకెళుతుంది’’ అన్నారు. ‘‘మేం అనుకున్న దానికంటే చిత్రం బాగా వచ్చింది. రిజల్ట్‌ విషయంలో నమ్మకంగా ఉన్నాం. యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులకూ ఈ చిత్రం నచ్చుతుంది’’ అని నిర్మాత రాము పేర్కొన్నారు.  ఈ చిత్రానికి కెమెరా: ఎస్‌.వి. గోపాల్‌.

Advertisement
 
Advertisement
Advertisement