కమల్హాసన్ తెలుగు అభిమానులకు శుభవార్త! | Good news for Kamal Hassan Telugu fans! | Sakshi
Sakshi News home page

కమల్హాసన్ తెలుగు అభిమానులకు శుభవార్త!

Apr 28 2015 7:06 PM | Updated on Sep 19 2019 9:06 PM

కమల్ హాసన్ - Sakshi

కమల్ హాసన్

ప్రముఖ నటుడు, నిర్మాత కమల్హాసన్ తెలుగు అభిమానులకు శుభవార్త.

చెన్నై: ప్రముఖ నటుడు, నిర్మాత కమల్హాసన్ తెలుగు అభిమానులకు శుభవార్త.  తెలుగు సినిమాలో తొలిసారిగా ఆయన తన గొంతు వినిపించబోతున్నారు. ఉత్తమ విలన్ తమిళ సినిమా తెలుగు వెర్షన్కు ఆయనే డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమా మే 1వ తేదీ శుక్రవారం విడుదల కానున్న విషయం తెలిసిందే. సాధారణంగా కమల్హాసన్ నటించిన చిత్రాలు తెలుగులోకి డబ్ చేస్తే ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాయిస్ ఇస్తారు.

'' ఉత్తమ విలన్ తెలుగు వెర్షన్కు కమల్ హాసన్ సర్ డబ్బింగ్ చెప్పారు. మొట్టమొదటిసారి తెలుగులో డబ్బింగ్ చెబుతున్నందున, ఈ విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. డబ్బింగ్ పూర్తి అయిన తరువాత, నచ్చక ఆయన రెండవసారి డబ్బింగ్ చెప్పారు'' అని సినిమా యూనిట్ వర్గాలు తెలిపాయి.

రమేష్ అరవింద్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో కమల్హాసన్ 8వ శతాబ్ధపు థియేటర్ కళాకారుడిగా, నేటి సూపర్ స్టార్గా నటించారు.

Advertisement
 
Advertisement
Advertisement