గుడ్‌ న్యూస్‌

Good News for Akshay Kumar, Kareena Kapoor Khan, Diljit Dosanjh and Kiara Advani - Sakshi

ఎవరికి? అంటే అక్షయ్‌ కుమార్, కరీనా కపూర్, కియారా అద్వానీ, దిల్జీత్‌ ఫ్యాన్స్‌తో పాటుగా సినీ లవర్స్‌ అందరికీ గుడ్‌ న్యూస్‌. సరే..ఈ గుడ్‌ న్యూస్‌ ఏంటో త్వరగా చెప్పండి అంటారా? అయితే చదవడం ఆపకండి. అక్షయ్‌ కుమార్, కరీనా కపూర్, కియారా అద్వానీ, దిల్జీత్‌ నటించనున్న సినిమాకు ‘గుడ్‌ న్యూస్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. రాజ్‌ మెహతా దర్శకత్వంలో ధర్మ ప్రొడక్షన్స్‌ పతాకంపై కరణ్‌ జోహార్‌ నిర్మించనున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కరీనా కపూర్‌ చేయనున్న రెండో చిత్రం ఇది. ఆఫ్టర్‌ మ్యారేజ్‌ ‘వీరే ది వెడ్డింగ్‌’ కరీనా ఫస్ట్‌ సినిమా.

అంతేకాదు అక్షయ్, కరీనా దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత నటించనున్న చిత్రం కూడా ఇదే. ‘కంబక్త్‌ ఇష్క్‌’ సినిమాలో చివరిసారిగా అక్షయ్, కరీనా కలిసి నటించారు. అలాగే ‘ఉడ్తా పంజాబ్‌’ సినిమా తర్వాత దిల్జీత్, కరీనా కలిసి నటిస్తున్నారు. అలాగే బర్త్‌డేను (జూలై 31) సూపర్‌గా సెలబ్రేట్‌ చేసుకున్న కియారా అద్వానీ 48 గంటలు తిరగక ముందే కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌ చేయడం ఆమె అభిమానులకు గుడ్‌ న్యూసే కదా. ఈ సినిమాలో సంతానం కోసం తాపత్రయ పడే దంపతులుగా అక్షయ్, కరీనా కనిపిస్తారని బీటౌన్‌ టాక్‌. దిల్జీత్, కియారా పంజాబీ కపుల్‌గా కనిపించనున్నారట. ‘గుడ్‌ న్యూస్‌’ చిత్రాన్ని వచ్చే ఏడాది జూలై 19న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top