దూకింది ఎవరు? | gautham nanda: gopichand skydive | Sakshi
Sakshi News home page

దూకింది ఎవరు?

Apr 11 2017 11:17 PM | Updated on Sep 5 2017 8:32 AM

దూకింది ఎవరు?

దూకింది ఎవరు?

ఎల్తైన ప్రదేశం నుంచి కిందకి చూడాలంటే హార్ట్‌ బీట్‌ పెరిగిపోతుంది.

ఎల్తైన ప్రదేశం నుంచి కిందకి చూడాలంటే హార్ట్‌ బీట్‌ పెరిగిపోతుంది. అలాంటిది విమానం నుంచి అమాంతం దూకమంటే... ‘బతికుంటే బలిసాకైనా తిని బతకొచ్చు’ అని పారిపోతారు. అదే గోపీచంద్‌లాంటి డేర్‌ అండ్‌ డ్యాషింగ్‌ వ్యక్తులైతే ఆలోచించకుండా ‘ఓకే’ అనేస్తారు. దర్శకుడు సంపత్‌ నంది ఈ ‘స్కై డైవింగ్‌’ గురించి చెప్పగానే గోపీచంద్‌ ‘సై’ అన్నారు. ప్రస్తుతం గోపీ హీరోగా సంపత్‌ నంది తెరకెక్కిస్తున్న ‘గౌతమ్‌ నంద’ చిత్రం కోసమే ఈ స్కై డైవ్‌ సీన్స్‌ చిత్రీకరించారు.

‘‘సౌతిండియన్‌ మూవీస్‌లో పూర్తి స్థాయి ‘స్కై డైవ్‌’ ఎపిసోడ్‌ ఉన్న మొదటి సినిమా మాదే. గోపీచంద్‌గారి ధైర్యసాహసాలకు హ్యాట్సాఫ్‌. ఆయన అభిమానులకు కచ్చితంగా పండగే’’ అని సంపత్‌ నంది పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో సై్టలిష్‌ లుక్స్‌తో ఇప్పటికే గోపీచంద్‌ ఆకట్టుకున్నారు. ఇందులో ఆయన ‘గౌతమ్‌ ఘట్టమనేని’, ‘నందకిషోర్‌’గా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇంతకీ స్కై డైవ్‌ చేసింది గౌతమా? లేక నందకిషోరా?... ఆ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్పం అంటోంది ‘గౌతమ్‌ నంద’ యూనిట్‌. శ్రీ బాలజీ సినీమీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హన్సిక, కేథరిన్‌ కథానాయికలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement