'ఊపిరి'కి ఫ్రెంచ్ నిర్మాతల ప్రశంసలు | gaumont producers of intouchables applaud oopiri | Sakshi
Sakshi News home page

'ఊపిరి'కి ఫ్రెంచ్ నిర్మాతల ప్రశంసలు

Apr 2 2016 11:24 AM | Updated on Jul 15 2019 9:21 PM

'ఊపిరి'కి ఫ్రెంచ్ నిర్మాతల ప్రశంసలు - Sakshi

'ఊపిరి'కి ఫ్రెంచ్ నిర్మాతల ప్రశంసలు

నాగార్జున, కార్తీలు ప్రధాన పాత్రల్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఊపిరి. నాగ్ లాంటి స్టార్ హీరో వీల్ చైర్లోనే కనిపించే పాత్రలో నటించిన ఈ సినిమా, విడుదలైన దగ్గరనుంచి సూపర్ హిట్...

నాగార్జున, కార్తీలు ప్రధాన పాత్రల్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఊపిరి. నాగ్ లాంటి స్టార్ హీరో వీల్ చైర్లోనే కనిపించే పాత్రలో నటించిన ఈ సినిమా, విడుదలైన దగ్గరనుంచి సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అయిన ఊపిరి ఓవర్సీస్ మార్కెట్లో కూడా భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సినిమా సక్సెస్పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఫ్రెంచ్ మూవీ 'ద ఇంటచబుల్స్'కు రీమేక్గా రూపొందిన ఊపిరి సినిమాపై ఒరిజినల్ సినిమా నిర్మాతలు ప్రశంసల జల్లు కురిపించారు. ఒరిజినల్ వర్షన్ను మించే స్ధాయిలో ఊపిరి సినిమా తెరకెక్కిందంటూ ద ఇంటచబుల్స్ నిర్మాణ సంస్థ గౌమాంట్, ఓ ప్రకటన విడుదల చేసింది. ఫ్రెంచ్ సినీ చరిత్రలోనే భారీ విజయాన్ని నమోదు చేసిన తమ సినిమా, భారత్లో కూడా సంచలనం సృష్టిస్తుండటం పై వారు ఆనందం వ్యక్తం చేశారు. ఊపిరి టీంకు అభినందనలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement