మహాత్మున్ని స్మరించిన సల్మాన్‌, షారుఖ్‌, రణబీర్‌

Gandhiji 150th Birth Anniversary Celebrations Bollywood Stars Meets Modi - Sakshi

న్యూఢిల్లీ : మహాత్ముని 150వ జయంత్యుత్సవాలను అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. దానిలో భాగంగా బాలీవుడ్‌ ప్రముఖ నటులు, నిర్మాతలతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం భేటీ అయ్యారు. ‘గాంధీ ఎట్‌ 150’ ఇతివృత్తంగా తీసిన వీడియోలను లోక కళ్యాణ్‌ మార్గ్‌లోని తన నివాసంలో మోదీ విడుదల చేశారు. గాంధీజీ బోధనల ఆధారంగా #ChangeWithin పేరుతో రాజ్‌కుమార్‌ హిరాణీ రూపొందించిన 100 సెకండ్ల వీడియోలో ఆమిర్‌ఖాన్‌, షారుఖ్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌ రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌, సోనమ్‌కపూర్‌ అహుజా, కంగనా రనౌత్‌, విక్కీ కౌశల్‌ భాగమయ్యారు.

గాంధీజీ గొప్ప ఆలోచనలు ప్రతిధ్వనించేల ఎంతో మందికి స్ఫూర్తి కలిగించే బాపు మాటలు, ఆలోచనలతో వీడియో రూపొందించారని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. మోదీని కలిసిన వారిలో బోనీ కపూర్‌, అనిల్‌ కపూర్‌, జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌ సహా పలువురు సినీ, టెలివిజన్‌ ప్రముఖలు ఉన్నారు.  2022లో జరుపుకునే 75వ స్వాతంత్య్ర దిన వేడుకలపైనా ఈ సమావేశంలో చర్చించారు.
(చదవండి : ప్రధానిపై మెగా కోడలి సంచలన ట్వీట్‌)

#ChangeWithin లో రాజ్‌కుమార్‌ హిరాణీ తననూ భాగం చేసినందుకు ధన్యవాదాలు అంటూ షారుఖ్‌ ట్వీట్‌ చేశారు. ‘ఒక వ్యక్తి మన యావత్‌ జాతిని మార్చగలిగారు. ఆయన ఆలోచనలు, ఆయన వారసత్వం ఎప్పుడూ నిలిచి ఉంటాయి. గాంధీజీ 150వ జయంతి సందర్భంగా #ChangeWithin లో భాగం అయ్యాను. థాంక్స్‌ రాజ్‌కుమార్‌’ అని సల్మాన్‌ ట్విటర్‌లో రాసుకొచ్చారు. వీరితోపాటు అలియా, సోనమ్‌, అనిల్‌ కపూర్‌, రాజ్‌కుమార్‌ హిరాణీ ట్విటర్‌లో ఈ వీడియోను  ట్విటర్‌లో పోస్టు చేశారు.
(చదవండి : బాలీవుడ్‌ ప్రముఖులతో ప్రధాని భేటీ)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top