గాల్లో తేలేట్టు చేసే వినోదం | Gallo Telinattundhe releasing on Aug 1 | Sakshi
Sakshi News home page

గాల్లో తేలేట్టు చేసే వినోదం

Jul 22 2014 10:42 PM | Updated on Sep 2 2017 10:42 AM

గాల్లో తేలేట్టు చేసే వినోదం

గాల్లో తేలేట్టు చేసే వినోదం

యువతరం మనోభావాలకు దగ్గరగా ఉండే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘గాల్లో తేలినట్టుందే’. అజయ్‌వర్మ, ఖుషి, మోనీషా ప్రధాన పాత్రధారులు.

యువతరం మనోభావాలకు దగ్గరగా ఉండే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘గాల్లో తేలినట్టుందే’. అజయ్‌వర్మ, ఖుషి, మోనీషా ప్రధాన పాత్రధారులు. సురేష్ గుణ్ణం దర్శకుడు. సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, చొక్కాకుల వెంకట్రావ్ నిర్మాతలు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 1న విడుదల కానుంది. వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రేక్షకులకు నచ్చేఅంశాలన్నీ ఉంటాయని దర్శకుడు చెప్పారు.
 
 నిర్మాతల్లో ఒకరైన వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ -‘‘ఇది క్లీన్ ఎంటర్‌టైనర్. యువతకు నచ్చే అన్ని అంశాలూ ఇందులో ఉన్నాయి’’ అని తెలిపారు. పోసాని, సయాజీ షిండే, కృష్ణభగవాన్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: సాయికార్తీక్, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శీలం లక్ష్మణ్, సహ నిర్మాత: భాస్కర్ విల్లూరి.
 

Advertisement
 
Advertisement
Advertisement