యువతరానికి పండగే | 'Gaalipatam' to be released in August first week | Sakshi
Sakshi News home page

యువతరానికి పండగే

Jul 24 2014 11:19 PM | Updated on Sep 2 2017 10:49 AM

యువతరానికి పండగే

యువతరానికి పండగే

దర్శకుడు సంపత్‌నంది నిర్మాతగా మారి, కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటిలతో కలిసి నిర్మించిన చిత్రం ‘గాలిపటం’. ఆది, ఎరికా ఫెర్నాండేజ్,

 దర్శకుడు సంపత్‌నంది నిర్మాతగా మారి, కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటిలతో కలిసి నిర్మించిన చిత్రం ‘గాలిపటం’. ఆది, ఎరికా ఫెర్నాండేజ్, క్రిస్టినా ఆకిహివా ప్రధాన పాత్రధారులు. నవీన్‌గాంధీ దర్శకుడు. ఆగస్ట్ తొలివారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సంపత్‌నంది మాట్లాడుతూ -‘‘పేరుకు తగ్గట్టే విభిన్నంగా ఉంటుందీ సినిమా. యువతరం పండుగ చేసుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి.
 
 భీమ్స్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన వస్తోంది. ఆది నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ’’ అని చెప్పారు. ‘గాలిపటం’ తనకు ప్రత్యేకమైన సినిమా అని, సాంకేతికంగా ఈ సినిమా ఓ అద్భుతమని, తాను ఇష్టంగా చేసిన సినిమా ఇదని ఆది తెలిపారు. సంపత్‌నంది, ఆయన టీమ్ కలిసి అంకితభావంతో పనిచేసి, ఓ అందమైన అద్భుతంగా ఈ చిత్రాన్ని మలిచారని నిర్మాతల్లో ఒకరైన విజయ్‌కుమార్ వట్టికూటి అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కె.బుజ్జి, నిర్మాణం: సంపత్‌నంది టీమ్ వర్క్స్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement