breaking news
Sampatnandi
-
సంపత్‌నందితో మళ్లీ చేస్తా!
‘‘ఈ సినిమా మళ్లీ ఇంకోసారి ప్రేక్షకుల మధ్యలో చూడాలనుంది. అవకాశం వస్తే, మళ్లీ సంపత్‌నందితో సినిమా చేస్తా’’ అని రవితేజ చెప్పారు. రవితేజ, తమన్నా, రాశీఖన్నాలతో సంపత్‌నంది దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన ‘బెంగాల్ టైగర్’ విజయోత్సవం శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా సంపత్‌నంది మాట్లాడుతూ- ‘‘ఈ సినిమా నాకు హ్యాట్రిక్ కావాలని హీరో రవితేజ పదేపదే మనస్ఫూర్తిగా అన్నారు. పైన తథాస్తు దేవతలు ఉన్నారేమో అందుకే హిట్ అయింది. బురదలో తీసిన ఫైట్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది’’అని అన్నారు. సంపత్‌నంది హ్యాట్రిక్ ఆనందంగా ఉందని నిర్మాత అన్నారు. ఈ వేడుకలో ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్, నాయిక తమన్నా పాల్గొన్నారు. -
యువతరానికి పండగే
దర్శకుడు సంపత్‌నంది నిర్మాతగా మారి, కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటిలతో కలిసి నిర్మించిన చిత్రం ‘గాలిపటం’. ఆది, ఎరికా ఫెర్నాండేజ్, క్రిస్టినా ఆకిహివా ప్రధాన పాత్రధారులు. నవీన్‌గాంధీ దర్శకుడు. ఆగస్ట్ తొలివారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సంపత్‌నంది మాట్లాడుతూ -‘‘పేరుకు తగ్గట్టే విభిన్నంగా ఉంటుందీ సినిమా. యువతరం పండుగ చేసుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. భీమ్స్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన వస్తోంది. ఆది నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ’’ అని చెప్పారు. ‘గాలిపటం’ తనకు ప్రత్యేకమైన సినిమా అని, సాంకేతికంగా ఈ సినిమా ఓ అద్భుతమని, తాను ఇష్టంగా చేసిన సినిమా ఇదని ఆది తెలిపారు. సంపత్‌నంది, ఆయన టీమ్ కలిసి అంకితభావంతో పనిచేసి, ఓ అందమైన అద్భుతంగా ఈ చిత్రాన్ని మలిచారని నిర్మాతల్లో ఒకరైన విజయ్‌కుమార్ వట్టికూటి అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కె.బుజ్జి, నిర్మాణం: సంపత్‌నంది టీమ్ వర్క్స్.