 
															ఆ సినిమాకు నాలుగు సీక్వెల్స్ అట!
బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టిన సంచలన చిత్రం 'అవతార్' కు ఇపుడు మూడు కాదు నాలుగు సీక్వెల్స్ రాబోతున్నాయట. అవతార్ సృష్టికర్త జేమ్స్ కెమెరూన్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు.
	లాస్  వెగాస్ : బాక్సాఫీస్  రికార్డులను బద్దలుకొట్టిన సంచలన చిత్రం 'అవతార్' కు ఇపుడు మూడు కాదు నాలుగు సీక్వెల్స్ రాబోతున్నాయట. అవతార్  సృష్టికర్త జేమ్స్ కెమెరూన్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు.  తమ ఇతిహాస శాస్త్ర కల్పిత చిత్రం "అవతార్"  కొనసాగింపుగా మూడు  భాగాలు తీద్దామనుకున్నా.. నాలుగవ భాగాన్ని కథ డిమాండ్  చేయడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.  దీనికి సంబంధించి  ప్రపంచ ప్రఖ్యాత రచయితలతో స్క్రి ప్టు వర్కు నడుస్తోందన్నారు.
	
	ప్రపంచంలో ప్రసిద్ది చెందిన స్క్రీన్ రైటర్స్ తో కూర్చొని స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించిన తరువాత.. సినిమాను నాలుగు భాగాలుగా తీయాలని అనుకున్నట్టు కామెరూన్ తెలిపారు.  అవతార్ 2 ని 2018 క్రిస్టమస్ కు విడుదల చేసుందుకు  ప్లాన్  చేస్తున్నామన్నారు. మిగతా భాగాలను వరసగా 2020, 2022, 2023 సంవత్సరాలలో రిలీజ్  చేయనున్నామని  జేమ్స్ కామెరూన్ పేర్కొన్నారు. గత రెండేళ్లుగా నలుగురు టాప్ స్క్రీన్ రచయితల బృందంతో అవతార్ కథ డిజైన్ చేస్తున్నామని.. నిజంగా   ఐతిహాసిక చిత్రాలుకానున్నాయనే  ధీమా వ్యక్తం చేశారు. అవతార్  మొదటి భాగాన్ని మించిపోయేలా స్వచ్ఛమైన ఊహలతో, కొత్త పాత్రలు, కొత్త జీవులు, కొత్త పర్యావరణం, కొత్త సంస్కృతులను ఈ నాలుగు భాగాల్లో పరిచయం చేయనున్నట్టు చెప్పారు.
	 
	కాగా మైనింగ్, అభివృద్ధి పేరుతో స్థానిక ప్రజల సంస్కృతి,  సాంప్రదాయాలు, ప్రకృతిపై జరిగే దాడికి సినిమా రూపం అవతార్. ప్రపంచవ్యాప్తంగా  ప్రశంసలతో  రికార్డు స్థాయి  వసూళ్లను కొల్లగొట్టిన  ఈ చిత్రానికి  గతంలోమూడు సీక్వెల్స్ తీస్తున్నట్టు దర్శకుడు కామెరూన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
	
	
	
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
