వెరీ స్పెషల్‌ | First look of Dileep's 'Kammara Sambhavam' out | Sakshi
Sakshi News home page

వెరీ స్పెషల్‌

Jan 7 2018 1:24 AM | Updated on Sep 28 2018 4:15 PM

First look of Dileep's 'Kammara Sambhavam' out - Sakshi

ఐదు నెలల తర్వాత ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ చేశారు మలయాళ నటుడు దిలీప్‌. అంత గ్యాప్‌ ఎందుకొచ్చింది? అంటే.. నటి భావన కేసులో నిందితుడిగా ఆల్మోస్ట్‌ 80 రోజులు జైల్లో ఉన్నారాయన. గతేడాది జూలై 10న దిలీప్‌ ‘రామలీల’ సినిమాలోని ఓ లుక్‌ను పోస్ట్‌ చేశారు. అదే రోజున భావన కేసుకు సంబంధించి ఆయన అరెస్ట్‌ అయ్యారు. దిలీప్‌ రిలీజైన తర్వాత విడుదలైన ‘రామలీలా’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది. అయితే.. ఇప్పుడు ఆయన పోస్ట్‌ చేసింది తన అప్‌కమింగ్‌ సినిమా ‘కమ్మార సంభవం’ గురించి. ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్న లుక్‌ను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారాయన.

దిలీప్, సిద్ధార్థ్, నమితా ప్రమోద్, బాబీ సింహా ముఖ్య తారలుగా నటిస్తున్నారు. రతిస్‌ అంబత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నిజానికి 2016లో ఈ సినిమా స్టారై్టంది. దిలీప్‌ అరెస్ట్‌ ఇష్యూతో షూటింగ్‌ లేట్‌ అయ్యింది. అందుకే ఈ సినిమా షూటింగ్‌ను ప్రస్తుతం వేగంగా జరుపుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే.. మలయాళంలో సిద్ధార్థ్‌కు ఈ సినిమా ఫస్ట్‌ మూవీ. ‘మలయాళంలో నా తొలి చిత్రం ‘కమ్మార సంభవం’ ఫస్ట్‌ లుక్‌ ఇది. దిలీప్‌ లుక్‌ బాగుంది కదూ. వెరీ స్పెషల్‌ లుక్‌. నాకు వెరీ వెరీ స్పెషల్‌ పిక్చర్‌’ అని సిద్ధార్థ్‌ సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. సిద్ధార్థ్‌ కూడా ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement