
‘‘అదిగో పులి అంటే.. ఇదిగో తోక అన్నట్లుగా’’.. డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రచారాలకు కొదవేలేదు. ఒక్కోసారి కారణం లేకుండానే కొన్ని కథనాలు వైరల్ అవుతూ ఉంటాయి. అమ్మాయి.. అబ్బాయి కలిసి కనిపిస్తే వారి రిలేషన్‌షిప్ స్టేటస్ ఇదేనంటూ గాసిప్‌రాయుళ్లు కథనాలు అల్లేస్తూ ఉంటారు.
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ (Sara Tendulkar) గురించి గతంలో వదంతులు వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. టీమిండియా నయా సూపర్‌స్టార్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)తో ఆమె ప్రేమలో ఉన్నట్లు రూమర్లు వినిపించాయి. వీరిద్దర సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు ఫాలో చేయడం.. లైకులు కొట్టడం ఇందుకు ప్రధాన కారణం.
ఇటీవలే అర్జున్ టెండుల్కర్ నిశ్చితార్థం
అయితే, ప్రేమ విషయం గురించి ఇటు సారా.. లేదంటే గిల్ ఎక్కడా స్పందించలేదు. ఇదిలా ఉంటే.. సచిన్ కుమారుడు, సారా తమ్ముడు అర్జున్ టెండుల్కర్ వివాహ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ముంబైలోని బడా వ్యాపారవేత్త రవి ఘాయ్ మనుమరాలు సానియా చందోక్‌తో అర్జున్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు.

ఎవరా అబ్బాయి?
ఈ నేపథ్యంలో సారా రిలేషన్‌షిప్ స్టేటస్ ఏమిటనే చర్చ నెట్టింట మొదలైంది. ఈ క్రమంలో ఓ వ్యక్తితో సారా సన్నిహితంగా ఉన్న ఫొటోలు తాజాగా వైరల్ అవుతున్నాయి. గోవాకు చెందిన ఆర్టిస్ట్ సిద్దార్థ్ కేర్కర్‌తో ఆమె ప్రేమలో ఉన్నట్లు వార్తలు పుట్టుకొస్తున్నాయి.
సారాతో పాటు సచిన్ కుటుంబం మొత్తంతో సిద్దార్థ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌లకు సారాతో కలిసి హాజరైన అతడు.. సచిన్, అతడి భార్య అంజలితో కలిసి కూడా కొన్ని ఈవెంట్లలో సందడి చేశాడు.
ఈ నేపథ్యంలోనే సారా- సిద్దార్థ్ ప్రేమ అంటూ వార్తలు వస్తున్నాయి. మరికొందరు ఓ అడుగు ముందుకేసి వీరి నిశ్చితార్థం జరిగిందని వదంతులు వ్యాప్తి చేస్తున్నారు.

అసలు విషయం ఏంటి?
కాగా సిద్దార్థ్‌కు గోవాలో ఓ రెస్టారెంట్ ఉన్నట్లు సమాచారం. ఇన్‌స్టాలో అతడికి తొంభై వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. సారా ఒక్కరనే కాదు.. వివిధ మోడల్స్‌తో దిగిన ఫొటోలను సిద్దార్థ్ పోస్ట్ చేస్తూ ఉంటాడు. అన్నట్లు సారా మోడల్ అన్న విషయం తెలిసిందే. అదీ అసలు సంగతి!!
ఇక ఇటీవలే ఆస్ట్రేలియా టూరిజం బ్రాండ్ ఎంబాసిడర్‌గా ఎంపికైన సారా.. ముంబైలో ఓ వెల్‌నెస్ సెంటర్ కూడా ఓపెన్ చేసింది. అర్జున్‌కు కాబోయే భార్య సానియా సారాకు బెస్ట్‌ఫ్రెండ్. కాగా సచిన్- అంజలి దంపతులకు సారా, అర్జున్ సంతానం అన్న విషయం తెలిసిందే.
చదవండి: రూ. 4 వేల కోట్ల ప్యాలెస్.. 560 కిలోల బంగారం, వెండి రైలు, రథం.. ఇంకా..