సౌత్‌ ఫిల్మ్‌ఫేర్‌.. తెలుగు విజేతలు వీరే | Filmfare Awards South 2019 Full List | Sakshi
Sakshi News home page

సౌత్‌ ఫిల్మ్‌ఫేర్‌.. తెలుగు విజేతలు వీరే

Dec 22 2019 9:25 AM | Updated on Dec 22 2019 2:32 PM

Filmfare Awards South 2019 Full List - Sakshi

66వ సౌత్‌ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల ప్రధానోత్సవం శనివారం చెన్నైలోని జవహర్‌లాల్‌ నెహ్రు ఇండోర్‌ స్టేడియంలో ఘనంగా జరిగింది. 2018 ఏడాదికిగానూ దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యుతమ ప్రతిభ కనబరిచిన నటీనటులకు, సాంకేతిక నిపుణలకు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల ప్రధానం చేశారు. తెలుగు, త‌మిళ‌, కన్నడ, మళయాళ చిత్ర పరిశ్రమల నటీనటులు ఈ వేడుకకు పెద్ద ఎత్తున హాజర‌య్యారు. తెలుగులో మహానటి, రంగస్థలం చిత్రాలు పలు విభాగాల్లో సత్తా చాటాయి. రంగస్థలం చిత్రానికి సంబంధించి రామ్‌చరణ్‌ ఉత్తమ నటుడిగా, సీనియర్‌ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి ఉత్తమ చిత్రంగా, అదే చిత్రానికి సంబంధించి కీర్తి సురేశ్‌ ఉత్తమ నటిగా అవార్డులు సొంతం చేసుకున్నారు. అరవింద సమేత చిత్రానికి గానూ జగపతిబాబు ఉత్తమ సహాయనటుడిగా అవార్డు దక్కించుకున్నారు.

తెలుగు
ఉత్తమ చిత్రం - మహానటి
ఉత్తమ దర్శకుడు - నాగ్‌ అశ్విన్ ‌(మహానటి)
ఉత్తమ నటుడు - రామ్‌చరణ్‌ (రంగస్థలం)
ఉత్తమ నటి - కీర్తి సురేశ్‌ ( మహానటి)
ఉత్తమ నటుడు (విమర్శకుల విభాగం) - దుల్కర్‌ సల్మాన్‌ (మహానటి)
ఉత్తమ నటి (విమర్శకుల విభాగం) - రష్మిక మందన్న (గీతా గోవిందం)
ఉత్తమ సహాయ నటి - అససూయ భరద్వాజ్‌ (రంగస్థలం) 
ఉత్తమ సహాయ నటుడు - జగపతిబాబు (అరవింద సమేత)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - రత్నవేలు (రంగస్థలం) 
ఉత్తమ మ్యూజిక్‌ అల్బమ్‌ - దేవీ శ్రీ ప్రసాద్‌ (రంగస్థలం)
ఉత్తమ గేయ రచయిత - చంద్రబోస్‌(ఎంత సక్కగున్నావే- రంగస్థలం)
ఉత్తమ నేపథ్య గాయకుడు - సిద్ శ్రీరామ్ (ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే- గీత గోవిందం)
ఉత్తమ నేపథ్య గాయని - శ్రేయా ఘోషాల్‌ (మందరా మందరా-భాగమతి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement