బాబా భాస్కర్‌-అలీ వ్యవహారం ముదురుతోందా?

Fight Between Ali Reza And Baba Bhaskar In Bigg Boss 3 Telugu - Sakshi

బిగ్‌బాస్‌ ఇంట్లో గొడవలు ముదురుతున్నాయి. అలాగే సోషల్‌ మీడియాలో వారి ఫాలోవర్స్‌ మధ్య వాడివేడిగా చర్చలు జరగుతున్నాయి. బిగ్‌బాస్‌ హౌస్‌లో ముందు నుంచీ స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అయిన బాబా భాస్కర్‌ గ్రాఫ్‌ క్రమక్రమంగా తగ్గిపోతున్నట్లు అనిపిస్తోంది. జాఫర్‌ ఉన్నంత కాలం ఆయనతో సరదాగా కామెడీలు చేస్తూ, ఆటపాటలతో ఎంజాయ్‌ చేసిన బాబాకు రానురాను గడ్డుపరిస్థతి ఎదురయ్యేట్టు కనిపిస్తోంది. జాఫర్‌ ఎలిమినేట్‌ అయ్యాక కుంగిపోయిన బాబా.. అనంతరం శ్రీముఖి, మహేష్‌లతో క్లోజ్‌ అయ్యాడు. ఎప్పుడు చూసిన మహేష్‌ లేదా శ్రీముఖితో ఉంటూ.. మిగతా వారిని గ్రూప్‌ అంటూ కామెంట్లు చేస్తూ ఉంటే వింటూ ఉంటున్నాడు.

సీక్రెట్‌ టాస్క్‌లో భాగంగా అలీరెజా, పునర్నవిలు కనిపించకుండా పోయినప్పుడు బాబా భాస్కర్‌, హిమజలు వారిద్దరు రాకపోయినా తమకేం ఇబ్బంది లేదన్న సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే అదే విషయాన్ని గుర్తించుకుని అలీ రెజా బాబాను నామినేట్‌ చేశాడని, కెప్టెన్సీ టాస్క్‌లో బాబా అంతగా సహాయం చేసినా అది గుర్తుంచుకోలేదని అలీరెజాను టార్గెట్‌ చేస్తున్నారు బాబా ఫాలోవర్స్‌. 

శ్రీముఖి, మహేష్‌ మాటలకు ఇన్‌ఫ్లూయెన్స్‌ అవుతూ.. వారితోనే ఓ గ్రూప్‌గా ఉంటూ మిగతా వారి గురించి కామెంట్లు చేస్తుంటే వింటూ ఉంటాడు, ఏదైనా గొడవలు జరిగితే సేఫ్‌ గేమ్‌ ఆడుతూ.. ఏ స్టాండ్‌ సరిగా తీసుకోకుండా ఉంటాడని ఓ వర్గం బాబాను టార్గెట్‌ చేస్తోంది. మొత్తానికి మంచి వాడిగా, స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న బాబా భాస్కర్‌.. నామినేషన్స్‌లోకి వస్తే కంగారుపడటం, బాధపడటం ఆయన ఫాలోవర్స్‌కు మింగుడుపడటం లేదు. బాబా భాస్కర్‌ను ఏడిపించేలా చేస్తారా? అంటూ ఆయన అభిమానులు ఫైర్‌ అవుతున్నారు. ఇక ఈ వారం బిగ్‌బాస్‌ హౌస్‌లో కెప్టెన్‌గా ఎవరు ఎన్నికవుతారో చూడాలి.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top