భారీ యాక్షన్ మూవీ రిలీజ్ వాయిదా..! | Fast and Furious 9 Release Date Delayed | Sakshi
Sakshi News home page

భారీ యాక్షన్ మూవీ రిలీజ్ వాయిదా..!

Oct 7 2017 3:10 PM | Updated on Oct 7 2017 4:18 PM

Fast and Furious 9

ప్రపంచ వ్యాప్తంగా వరుస విజయాలు సాధిస్తున్న యాక్షన్ సినిమా సిరీస్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. రేసింగ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లోని సినిమాలో హాలీవుడ్ తో పాటు ఇతర దేశాల్లోనూ భారీ వసూళ్లు సాధించాయి. ఈ ఏడాది విడుదల అయిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8 ఘనవిజయం సాధించటంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 1.2 బిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది.

అయితే 8వ భాగం రిలీజ్ సందర్భంగా తదుపరి భాగాన్ని 2019 ఏప్రిల్ 19న రిలీజ్ చేస్తామని ప్రకటించిన చిత్రయూనిట్, తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. సినిమాను ఏకంగా ఏడాది ఆలస్యంగా విడుదల చేయనున్నట్టుగా చిత్ర నిర్మాణ సంస్థ యూనివర్సల్ పిక్చర్స్ ప్రకటించింది. 2020 ఏప్రిల్ 10న ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ లో 9 వ భాగం విడుదల అవుతుందని అధికారిక సోషల్ మీడియా పేజ్ లో ప్రకటించారు. అయితే ఆలస్యానికి కారణం ఏంటన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement