అందాల తార త్రిష ఈ మధ్య అడ్వైజ్ ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు. మూడు దశాబ్దాల వయసులో పడ్డా చెరగని అందంతో వెలిగిపోతున్న ఈ చెన్నై చిన్నదానికి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.
అందాల తార త్రిష ఈ మధ్య అడ్వైజ్ ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు. మూడు దశాబ్దాల వయసులో పడ్డా చెరగని అందంతో వెలిగిపోతున్న ఈ చెన్నై చిన్నదానికి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో ఒక్కో చిత్రం చేస్తున్నారు. ఆమెకు ప్రస్తుతం విజయమనేది చాలా అవసరం. త్రిష కావాలనే చిత్రాలను తగ్గించుకుంటున్నారని, ఇంట్లో పెళ్లి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయనే ప్రచారం హోరెత్తుతోంది.
మొన్నటి వరకు శునక ప్రేమ కురిపించిన త్రిష, తాజాగా వితంతువులపై మమకారం చూపిస్తున్నారు. వితంతు వివాహాలకు మద్దతు తెలుపుతున్నారు. ఈ విషయంలో ఉచిత సలహాలు గుప్పిస్తున్నారు. ఇటీవల ఒక వ్యక్తి వితంతువును వివాహమాడడంతోపాటు ఆమె బిడ్డను తన బిడ్డగా అక్కున చేర్చుకున్నాడనే వార్తను చదివిన త్రిష ఎంతో ఎడ్మైర్ అయ్యారట. వెంటనే వితంతువుల వివాహాలను ప్రోత్సహించండంటూ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా మహిళల రెండవ వివాహానికి సహకరించాలని తన అభిమానులకు హితవు పలికారు.