కష్టాల్లో ‘మజిలీ’ | Election Effect Telugu Films Are Rescheduling Their Release Dates | Sakshi
Sakshi News home page

కష్టాల్లో ‘మజిలీ’

Mar 12 2019 12:07 PM | Updated on Mar 12 2019 12:07 PM

Election Effect Telugu Films Are Rescheduling Their Release Dates - Sakshi

అక్కినేని యువ జంట నాగచైతన్య, సమంతలు జోడిగా నటిస్తున్న సినిమా మజిలీ. పెళ్లి తరువాత చైతూ, సామ్‌లు కలిసి నటిస్తున్న ఈ సినిమా కావటంతో మజిలీపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్‌ 5న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్‌. సమ్మర్‌ సీజన్‌ కావటంతో కలెక్షన్లు కూడా బాగుంటాయని ఆ డేట్‌ను ఫిక్స్‌ చేశారు. నిన్నకోరి ఫేం శివా నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోపి సుందర్‌ సంగీతమందిస్తున్నారు.

అయితే ఇప్పుడు ఎలక్షన్‌ల హడావిడితో మజిలీకి కష్టాలు తప్పేలా లేవు. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆ ప్రభావం మజిలీ కలెక్షన్ల మీద పడే ప్రభావం ఉందని భావిస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో మజిలీని చెప్పిన డేట్‌కే రిలీజ్ చేస్తారా? లేక వాయిదా వేస్తారా అన్నది చూడాలి. అదే రోజు విడుదల కావాల్సిన నాని జెర్సీ సినిమాను ఇప్పటికే ఏప్రిల్‌ 19కి వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement