పహ్లాజ్‌ ఊస్టింగ్‌తో నాకు సంబంధం లేదు | Ekta Kapoor Not Involved in sacking of Pahlaj Nihalani | Sakshi
Sakshi News home page

పహ్లాజ్‌ ఊస్టింగ్‌తో నాకు సంబంధం లేదు

Aug 19 2017 9:00 AM | Updated on Sep 17 2017 5:42 PM

పహ్లాజ్‌ ఊస్టింగ్‌తో నాకు సంబంధం లేదు

పహ్లాజ్‌ ఊస్టింగ్‌తో నాకు సంబంధం లేదు

పహ్లజ్ నిహ్లానీ తొలగించటంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై ఏక్తా కపూర్ ఒత్తిడి చేసిందన్న వార్త బాలీవుడ్ లో వినిపించింది.

ముంబై: తన కత్తెర పవర్ తో చుక్కలు చూపించి ముప్పుతిప్పలు పెట్టిన పహ్లజ్ నిహ్లానీని తొలగించటంతో బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంటోంది. ఆ స్థానంలో వివాదరహితుడిగా పేరున్న ప్రసూన్‌ జోషిని సెన్సార్ బోర్డు కొత్త చైర్మన్‌ గా నియమించింది కేంద్రం. అయితే పహ్లాజ్ తొలగింపు వెనుక ప్రోడ్యూసర్‌ ఏక్తా కపూర్ హస్తం ఉందన్న వార్తలు మీడియాలో బలంగా వినిపిస్తోంది.  
 
కేంద్ర మంత్రి స్మృతి ఇరాని, ఏక్తా కపూర్ మంచి స్నేహితులు. ఈ నేపథ్యంలో ఏక్తా ఒత్తిడి మేరకే పహ్లాజ్ పై స్మృతి వేటు వేసిందని ఆ కథనం సారాంశం. ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని ఈ లేడీ ప్రోడ్యూసర్ చెబుతోంది. ‘అది పూర్తిగా ఆమె(స్మృతి ఇరానీ) తీసుకున్న నిర్ణయం. అందులో నా ప్రమేయం ఏం లేదు. అయినా ఆ క్రెడిట్ అంతా నాకే ఇచ్చిన వాళ్లకు ధన్యవాదాలు’ అని ఏక్తా తెలిపింది. 
 
పహ్లాజ్ కత్తెర దాటికి బలైన చిత్రాల్లో ఏక్తా నిర్మించిన లిపిస్టిక్ అండర్ మై బుర్ఖా చిత్రం కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమెపై ఇలాంటి పుకార్లు వచ్చి ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement