
దుల్కర్ సల్మాన్.. మమ్మూటీ
తక్కువ టైమ్‌లోనే స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్‌కు ఒక్క మాలీవుడ్‌లోనే కాదు.. మిగతా సౌత్ లాంగ్వేజ్‌ల్లోనూ క్రేజ్ ఎక్కువే. మెగాస్టార్ మమ్మూటీ తనయుడు అయినప్పటికీ.. ఆ పేరు వాడుకోకుండా సొంతగా పైకి ఎదిగాడన్న పేరు దుల్కర్‌కు ఉంది. అలాంటిది ఇప్పుడు బాలీవుడ్ అరంగ్రేటం కోసం మాత్రం తండ్రి సహకారం తీసుకోబోతున్నాడన్న వార్త ఒకటి తాజాగా చక్కర్లు కొడుతోంది.
రోన్ని స్క్రూవాలా నిర్మాతగా .. ఆకర్ష్ ఖురానా దర్శకత్వంలో ‘కార్వాన్’ చిత్రం ద్వారా దుల్కర్ బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రం కోసం రోన్ని.. మమ్మూటీతో పలుమార్లు చర్చలు జరిపినట్లు ముంబై మిర్రర్ తాజాగా ఓ కథనం ప్రచురించింది. తనయుడి బాలీవుడ్ డెబ్యూ కోసం మమ్మూకా స్వయంగా రంగంలోకి దిగారని, ప్రమోషన్ల విషయంలోనూ వేలు పెడుతున్నట్లు ఆ కథనం ఉటంకించింది.
దీనిపై దుల్కర్ ట్విటర్‌లో స్పందించాడు. ‘ ఆ వార్త నిజం కాదు. నా కెరీర్ ప్రారంభం నుంచి ఏ చిత్రం విషయంలోనూ నా తండ్రి జోక్యం చేసుకోలేదు. ఏ సినిమాను కూడా ప్రమోట్ కూడా చేయలేదు. అది అలాగే కొనసాగుతుంది’ అంటూ స్పష్టత ఇచ్చాడు. క్లారిటీ ఇచ్చినందుకు రీట్వీట్ చేసి ధన్యవాదాలు తెలిపిన బాలీవుడ్ ట్రేడ్ అనాలిస్ట్ తరణ్ ఆదర్శ్.. ఆ కథనం రోన్ని స్క్రూవాలా దృష్టికి కూడా వెళ్లిందని తెలిపారు.
Point noted @dulQuer... Absolutely aghast that the news was circulated to the media... Brought it to the attention of @RonnieScrewvala too... Glad you clarified! https://t.co/NvF65ItNMo
— taran adarsh (@taran_adarsh) 15 June 2018