ఇంకా కథ దొరకలేదు, అయినా 'డాన్ 3' ఉంటుంది | dont have a script for don 3 but movie is on | Sakshi
Sakshi News home page

ఇంకా కథ దొరకలేదు, అయినా 'డాన్ 3' ఉంటుంది

Nov 19 2015 11:27 AM | Updated on May 28 2018 4:05 PM

ఇంకా కథ దొరకలేదు, అయినా 'డాన్ 3' ఉంటుంది - Sakshi

ఇంకా కథ దొరకలేదు, అయినా 'డాన్ 3' ఉంటుంది

బాద్షా ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేసింది. షారూక్ ఖాన్ కెరీర్లో బిగెస్ట్ కమర్షియల్ సక్సెస్లుగా నిలిచిన డాన్ సీరీస్లో మరో సీక్వల్ రూపొందనుంది.ఈ విషయాన్ని అఫీషియల్గా...

బాద్షా ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేసింది. షారూక్ ఖాన్ కెరీర్లో బిగెస్ట్ కమర్షియల్ సక్సెస్లుగా నిలిచిన డాన్ సీరీస్లో మరో సీక్వల్ రూపొందనుంది.ఈ విషయాన్ని అఫీషియల్గా ఎనౌన్స్ చేశాడు దర్శకుడు ఫర్హాన్ అక్తర్. ఇప్పటికే ఈ సీరీస్లో విడుదలైన రెండు భాగాలు, టాక్తో సంబందం లేకుండా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టాయి. అందుకే చాలా రోజులుగా ఈ సీరీస్లో మూడో సినిమాకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అమితాబ్ హీరోగా తెరకెక్కిన 'డాన్' సినిమాను, షారూక్ ఖాన్ అదే పేరుతో రీమేక్ చేసి మంచి సక్సెస్ సాధించాడు. ఐదేళ్ల విరామం తరువాత అదే క్యారెక్టర్తో తెరకెక్కిన 'డాన్' కూడా షారూక్ను కమర్షియల్ స్టార్గా నిలబెట్టింది. దీంతో మరోసారి డాన్ క్యారెక్టర్లో తనని తానూ ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్నాడు బాద్షా. ఈ నేపధ్యంలో రకరకాల వార్తలు వినిపిస్తుండటంతో అన్నింటికి చెక్ పెట్టాడు దర్శకుడు పర్హాన్ అక్తర్..

'ఇప్పటి వరకు డాన్ 3 కథ రెడీ కాలేదు.. కానీ తప్పకుండా డాన్ 3 సినిమా ఉంటుంది. అందులో షారూక్ డాన్గా నటిస్తాడు' అంటూ ప్రకటించాడు. ప్రస్తుతం షారూక్ హీరోగా నటించిన దిల్వాలే రిలీజ్కు రెడీ అవుతుండగా, ఫ్యాన్, రాయిస్ సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ రెండు సినిమాల తరువాత డాన్ 3 సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement