'ఈ ట్రైలర్ నన్ను చాలా ఆకట్టుకుంది' | director mani ratnam says about solo trailer | Sakshi
Sakshi News home page

'ఈ ట్రైలర్ నన్ను చాలా ఆకట్టుకుంది'

Jul 29 2017 8:22 PM | Updated on Sep 27 2018 8:48 PM

'ఈ ట్రైలర్ నన్ను చాలా ఆకట్టుకుంది' - Sakshi

'ఈ ట్రైలర్ నన్ను చాలా ఆకట్టుకుంది'

ప్రస్తుతం సినిమాను ఆషామాషీగా తీస్తే ప్రేక్షకులు చూసే రోజులు పోయ్యాయి.

ప్రస్తుతం సినిమాను ఆషామాషీగా తీస్తే ప్రేక్షకులు చూసే రోజులు పోయ్యాయి. ఏదో కొత్తదనం కావాలి. సినిమా ఆకర్షణీయంగా ఉంటేనే ప్రేక్షకదేవుళ్లు ఆదరిస్తారు.  అలాంటి ఒక కొత్త ప్రయోగంతో సోలో అనే చిత్రం తెరకెక్కుతోంది. దర్శకుడు మణిరత్నం మాట్లాడుతూ.. ఇక్కడ తాను చూసిన సోలో చిత్ర ట్రైలర్ చాలా ఆకట్టుకుందన్నారు. ఈ సినిమా తమిళం, మళయాళం భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మాలీవుడ్ యువ హీరో దుల్కర్సల్మాన్ నటిస్తున్నారు. కార్పొరేట్ సంస్థ రెఫెక్స్ గ్రూప్ అధినేత అనిల్ జెయిన్ చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. ఆయన గేట్ అవే ఫిలింస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిజాయ్ నంబియార్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు బిజాయ్ నంబియార్ మాట్లాడుతూ.. తాను దర్శకత్వం వహిస్తున్న తొలి తమిళ చిత్రం సోలోనేనన్నారు. సోలో చిత్రం తమిళం, మలయాళ భాషల్లో నేరుగా చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. హీరో దుల్కర్సల్మాన్ మాట్లాడుతూ..  మంచి దర్శకుల వల్ల మంచి చిత్రాలను అందించగలుగుతున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం మలయాళం, తమిళం భాషల్లో ఏకకాలంలో చేస్తున్న ఈ చిత్రం ఎనిమిది చిత్రాల్లో నటించినంత  సమానం అని పేర్కొన్నారు.

తమిళంలో తన మూడు చిత్రాల కార్యక్రమాల్లోనూ దర్శకుడు మణిరత్నం పాల్గొన్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.  ఈ చిత్రానికి ముగ్గురు  ఛాయాగ్రహకులు, 11 మంది సంగీత దర్శకులు పనిచేస్తున్నారట. ఇందులో ఒక్కొ వెర్షన్కు 15 పాటల చొప్పున మొత్తం రెండు భాషలకు కలిపి 30 పాటలు ఉంటాయని చిత్ర వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement