‘ఎంఎస్ ధోనీ’ మరింత ఆలస్యం.. | Dhoni biopic release date pushed to September 30 | Sakshi
Sakshi News home page

‘ఎంఎస్ ధోనీ’ మరింత ఆలస్యం..

Jun 21 2016 3:26 PM | Updated on Sep 12 2019 8:55 PM

‘ఎంఎస్ ధోనీ’ మరింత ఆలస్యం.. - Sakshi

‘ఎంఎస్ ధోనీ’ మరింత ఆలస్యం..

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ‘ఎంఎస్ ధోనీ’ సినిమా విడుదల వాయిదా పడింది.

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ‘ఎంఎస్ ధోనీ’ సినిమా విడుదల వాయిదా పడింది. ఇంతకుముందు ప్రకటించినట్టు సెప్టెంబర్ 2న కాకుండా అదే నెల 30న ఈ సినిమా విడుదలకానుంది. ఈ సినిమాను అత్యుత్తమంగా ప్రేక్షకులకు అందించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి.

నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ధోనీ పాత్రను సుశాంత్ సింగ్ రాజ్పుత్ పోషిస్తున్నాడు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. నిర్మాణ విలువల్లో రాజీపడబోమని, సినిమాను పూర్తిచేయడానికి మరికొంత సమయం అవసరమని, దీంతో విడుదలను వాయిదా వేసినట్టు ఫాక్స్ స్టార్ స్టూడియో సీఈవో విజయ్ సింగ్ చెప్పాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement