వీఐపీ-2 రిలీజ్‌ డేట్‌ కన్‌ఫాం.. కానీ.. | dhanush's 'VIP 2' to release on August 11 | Sakshi
Sakshi News home page

వీఐపీ-2 రిలీజ్‌ డేట్‌ కన్‌ఫాం.. కానీ..

Aug 1 2017 9:58 PM | Updated on Jul 12 2019 4:35 PM

వీఐపీ-2 రిలీజ్‌ డేట్‌ కన్‌ఫాం.. కానీ.. - Sakshi

వీఐపీ-2 రిలీజ్‌ డేట్‌ కన్‌ఫాం.. కానీ..

ఎంతో కాలంగాఎదురు చూస్తున్న వీఐపీ-2 చిత్రం విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది.

చెన్నై: ఎంతో కాలంగాఎదురు చూస్తున్న వీఐపీ-2 చిత్రం విడుదలకు  ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది.  అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న ఈ మూవీ విడుదలను   హీరో  ధనుష్‌ ధృవీకరించారు.  సౌందర్యరజనీకాంత్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఆగస్టు 11న ఈ సినిమా థియేటర్లను పలకరించనుంది.    మూవీ విడుదలపై అంచనాలు వద్దంటూ ఇటీవల  వేడుకున్న  ధనుష్‌  ఈ విషయాన్ని  మంగళవారం ట్విట్టర్‌లో ధృవీకరించారు.  అయితే తమిళ వెర్షన్‌ రిలీజ్‌పై  ట్వీట్‌ ద్వారా  కబురు అందించిన ధనుష్‌ తెలుగు, హిందీ  భాషల్లో కూడా ఆగస్టు 11న విడుదల కానుందా లేదా అనే దానిపైమాత్రం క్లారిటీ ఇవ్వలేదు.  

ధనుష్‌ కథానాయకుడిగా  2014నాటి తమిళ బ్లాక్ బస్టర్ "వేల ఇల్ల పత్తతారి’’  చిత్రానికి  సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం వీఐపీ-2.  వీఐపీ మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ చిత్రానికినిర్మాత కలైపులి ఎస్‌.థాను, ధనుష్‌ వండర్‌బార్‌ ఫిలింస్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని  నిర్మించగా,  అమలాపాల్‌ కథానాయకిగా నటించింది. మరోముఖ్య పాత్రలో బాలీవుడ్‌ భామ కాజోల్‌,  సముతిరాకణి, వివేఖ్ నటించారు.   సాన్‌ రోల్డన్‌ సంగీతాన్ని అందించారు.  అటు ధనుష్‌ వరుస విజయాలు, ఇటు కాజోల్‌ రెండు దశాబ్దాల దర్వాత మళ్లీ ఈ చిత్రంలో నటించడంతో  ఈ వీఐపి -2 చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement