డేట్ ఫిక్స్ చేసిన ధనుష్ | Dhanush Vip 2 release Date | Sakshi
Sakshi News home page

డేట్ ఫిక్స్ చేసిన ధనుష్

May 11 2017 3:10 PM | Updated on Sep 5 2017 10:56 AM

డేట్ ఫిక్స్ చేసిన ధనుష్

డేట్ ఫిక్స్ చేసిన ధనుష్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ జెట్ స్పీడుతో దూసుకుపోతున్నాడు. నటుడిగానే కాక నిర్మాతగా, దర్శకుడిగానూ విజయాలు

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ జెట్ స్పీడుతో దూసుకుపోతున్నాడు. నటుడిగానే కాక నిర్మాతగా, దర్శకుడిగానూ విజయాలు సాధిస్తున్నాడు. తాజాగా తన నిర్మాతగా కథ మాటలు అందిస్తూ తెరకెక్కించిన సినిమా విఐపి 2. ఘనవిజయం సాధించిన విఐపి సినిమాకు సీక్వల్గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. విఐపి 2 కోసం అమలాపాల్ మరోసారి ధనుష్ తో జోడీ కడుతుండగా బాలీవుడ్ సీనియర్ స్టార్ కాజోల్ కీలక పాత్రలో నటిస్తోంది.

రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాను జూలై 28న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు హీరో, నిర్మాత ధనుష్. తమిళ్తో పాటు అదే రోజు తెలుగులోనూ రఘువరన్ బీటెక్ 2 పేరుతో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement