493 కోట్ల హిట్స్‌ వచ్చిన పాట.. తెలుగులో..! | Despacito Song Telugu Remake By Noel Sean | Sakshi
Sakshi News home page

493 కోట్ల హిట్స్‌ వచ్చిన పాట.. తెలుగులో..!

Mar 16 2018 5:54 PM | Updated on Mar 16 2018 8:40 PM

 Despacito Song Telugu Remake By Noel Sean - Sakshi

డెస్పాసిటో తెలుగు కవర్‌

సాక్షి, హైదరాబాద్‌ : గంగ్నమ్‌ స్టైల్‌ పాట మీరు వినే ఉంటారు కదూ. ఆ పాట ప్రపంచాన్ని ఎంతగా ఉర్రూతలు ఊగించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళ్లీ అదే స్థాయిలో యూట్యూబ్‌ ప్రపంచాన్ని కుదిపేస్తున్న పాట ‘డెస్పాసిటో’.. స్పానిష్‌, ఇంగ్లీష్‌ లిరిక్స్‌తో రూపుదిద్దుకున్న ఈ పాటను తెలుగు రిమేక్‌ చేశారంటే అది ఎంతలా ప్రపంచాన్ని ఆకట్టుకుంటుందో అర్థం అవుతుంది.

ప్యూర్టోరికో దేశానికి చెందిన ప్రముఖ సింగర్‌ లూయిస్‌ ఫోన్సీ, డాడీ యాంకీలు డెస్పాసిటోను కంపోజ్‌ చేశారు. 2017లో విడుదలైన ఈ పాట కేవలం 16 వారాల్లో యూట్యూబ్‌లో 493 కోట్ల మందికి పైగా వీక్షించారు. ఇంత తక్కువ సమయంలో అత్యధిక మంది వీక్షించిన పాట ఇదే. డెస్పాసిటోతో ఇంప్రెస్‌ అయిన గాయకుడు నోయల్‌ సీన్‌, గాయని ఎస్తర్‌ నొరాహాలు కలసి తెలుగులో ఈ పాటను పాడారు.

ఇందుకు సంబంధించిన వీడియోను నోయల్‌ ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు. డెస్పాసిటో ప్రేమలో పడ్డా నీతో అని సాగే పాట అద్భుతంగా ఉంది. అయితే, ఒరిజినల్‌ పాటకు నోయల్‌ కంపోజ్‌ చేసిన పాటకు తేడా ఉంది. ఒరిజినల్‌ను కాపీ చేయకుండా నోయల్‌ చేసిన ప్రయత్నం ఆకట్టుకుంటోంది. లిరిక్స్‌ కూడా వినడానికి చక్కగా ఉన్నాయి. ఇప్పటివరకూ ఈ పాటకు యూట్యూబ్‌లో 40 వేల పైచిలుకు వీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement