బిగ్‌బాస్‌ : సునయన ఎలిమినేషన్‌ తప్పదా?

Deepthi Sunaina Fires On Koushal In Bigg Boss 2 Telugu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ సీజన్‌-2 మరింత రసవత్తరంగా మారింది. గతవారం కాస్త చప్పగా సాగిన ఈ రియాల్టీ షో మళ్లీ వేడెక్కింది. బాగ్‌బాస్‌ సూపర్‌ టాస్క్‌తో గేమ్‌ను రక్తికట్టించాడు. భావోద్వేగాలతో సాగే ఈ గేమ్‌ను ఆ దిశగా నడిపించాడు. ఇంటి సభ్యుల్లో ఒకరిపై ఒకరికి ఉన్న అభిప్రాయాలను బయటకు తీశాడు. ఇలా మంగళవారం ఎపిసోడ్‌ అత్యంత ఆసక్తికరంగా సాగింది. ఇంటి సభ్యులను రెండు జట్లుగా వీడదీసిన బిగ్‌బాస్‌.. టెలికాలర్స్‌ Vs పబ్లిక్‌ కాలర్స్‌ అనే టాస్క్‌ను ఇచ్చాడు. బిగ్‌బాస్‌ టెలికాలర్స్‌ జట్టులో కౌశల్‌, సామ్రాట్‌, నూతన నాయుడు, అమిత్‌, శ్యామల, దీప్తిలు ఉండగా.. గీతా మాధురి, తనీశ్‌‌, దీప్తీ సునయన, గణేశ్‌, రోల్‌రైడా, పూజా రాంచంద్రన్‌లు పబ్లిక్‌ కాలర్స్‌గా వ్యవహరించారు. బిగ్‌బాస్‌ టెలికాలర్స్‌ను విసుగెత్తించి కాల్‌ కట్‌ చేసేలే చేస్తే పబ్లిక్‌ కాలర్స్‌కు ఓ పాయింట్ లభిస్తోంది. దీనికోసం వారు ఏదైనా మాట్లడొచ్చు. ముగ్గురు టెలికాలర్స్‌ షిఫ్ట్‌ బజర్‌ మోగేంత వరకు ఏమైనా అక్కడి నుంచి లేవకూడదు. ఈ బజర్‌ మోగేలోపు పబ్లిక్‌ కాలర్స్‌ షిప్ట్‌లో ఉన్న ముగ్గురికి కాల్‌ చేయాల్సి ఉంటుంది.

మళ్లీ కౌశలే టార్గెట్‌..
ఈ టాస్క్‌లో ఎప్పటిలానే మళ్లీ కౌశలే టార్గెట్‌ అయ్యాడు. ఇంటి సభ్యులు మరోసారి సూటి పోటి మాటలతో దాడి చేశారు. ఎంత పర్సనల్‌గా దాడి చేసినా కౌశల్‌ మాత్రం అదే రితీలో బదులిచ్చాడు. ఇప్పటి వరకు కొంత స్నేహంగా ఉన్న గీతా-కౌశల్‌ల మధ్య ఉన్న మనస్పర్థలు ఈ టాస్క్‌ ద్వారా బయటపడ్డాయి. తొలుత కాల్‌ చేసిన గీతా మాధురి ఈ వారం నామినేషన్‌ ప్రక్రియ గురించి మాట్లాడుతూ.. అతన్ని విసిగించసాగింది. అబద్దాలు ఆడుతున్నావని, గేమ్‌ కోసం ఏమైనా చేస్తావా? అని ఘాటుగా ప్రశ్నించింది. ఇక టాస్క్‌కు ముందు కొంత ఎమోషన్‌ అయిన గీతా ఇంటి సభ్యుల అందరి దగ్గరకు వచ్చి టాస్క్‌ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని ఆందోళన వ్యక్తం చేసింది. తీరా ఆమె కౌశల్‌ను టార్గెట్‌ చేస్తూ మాట్లాడటం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.

తనీశ్‌ Vs శ్యామల
సెకండ్‌ కాల్‌ చేసిన తనీశ్‌ సైతం శ్యామలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. ఆమె రీఎంట్రీని సహించని అతను పలుసంధర్భాల్లో ఆవిషయాన్ని బయటపెట్టిన విషయం తెలిసిదే. గత టాస్క్‌లో దీప్తి సునయన వ్యవహారంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆరా తీశాడు. ఎలిమినేషన్‌కు గురించి ఆమెకు ఆగ్రహం తెప్పించేలా ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఆమె ఓపికగా సమాధానం చెప్పింది. దీంతో తనీష్‌ ఏం చేయలేక ఫోన్‌ పెట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తరువాత రోల్‌రైడా సేఫ్‌గా స్మార్ట్‌ గేమ్‌ ఆడాడు. ఎవరిని మాటలతో నొప్పించకూడదనుకున్న రైడా.. సామ్రాట్‌కు కాల్‌ చేసి కౌశలా? అని అడిగాడు. దానికి రైడా ఫోన్‌ పెట్టేస్తున్నట్లు బిల్డప్‌ ఇచ్చి సామ్రాట్‌ను బోల్తా కొట్టించాడు. ఇది గ్రహించని సామ్రాట్‌ ఫోన్‌ పెట్టేసి పప్పులో కాలేసాడు. దీంతో పబ్లిక్‌ కాలర్స్‌కు ఓ పాయింట్‌ లభించింది.

కౌశల్‌.. జనాలు తూ..
దీప్తి సునయన సైతం మళ్లీ కౌశల్‌కే కాల్‌ చేసింది. షో ఆరంభం నుంచే అతనంటే గిట్టని సునయన తన ఆగ్రహాన్ని వెళ్లగక్కింది. కౌశల్‌ ఫోన్‌ ఎత్తగానే అసభ్య పదజాలంతో మొదలు పెట్టింది. దీనికి స్టన్‌ అయిన కౌశల్‌ తేరుకోని అదే రీతిలో బదులిచ్చాడు. ఒక దశలో వీరి సంభాషణ హద్దులు దాటింది. ముఖ్యంగా సునయన కౌశల్‌ను కించపరిచేలా మాట్లాడుతూ అతని సహనాన్ని పరీక్షించింది. ‘అసలు నువ్వు హౌస్‌లోకి ఎందుకొచ్చావ్‌.. షోను 24 గంటలు జనాలు చూస్తే తూ అంటారు’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఆమె మాటలకు దగ్గట్టే జవాబిచ్చాడు. పాటలు పాడమని, స్టోరీలు చెప్పమని విసగించడంతో కౌశల్‌ అటాకింగ్‌ గేమ్‌ ఆడాడు. ఓ దశలో  హద్దులు దాటి ప్రవర్తించాడు. బయటి వ్యక్తుల పేర్లను ప్రస్తావిస్తూ ఆమె మాటల దాడికి కౌంటర్‌ ఇచ్చాడు. స్టోరీలు చెప్పమంటే హౌస్‌లో ఆమె ప్రేమాయణం చెప్పాడు. పాట పాడమంటే ఆమెకు సంబంధించే పాడాడు. దీంతో సునయన కన్నీటి పర్యంతమైంది. దాదాపు కొన్ని గంటల పాటు సునయన విసిగించింది. కనీసం వాష్‌ రూం వెళ్లే పరిస్థితి లేకపోవడంతో టీం సభ్యుల సాయంతో కౌశల్‌ అక్కడే కానిచ్చాడు. ఇక గణేశ్‌ కూడా కౌశల్‌నే టార్గెట్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

సునయనపై ట్రోలింగ్‌..
సునయన మాటలు, కౌశల్‌తో వ్యవహరించిన తీరు పట్ల నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కౌశల్‌ ఆర్మీ ఆమెను టార్గెట్‌ చేసింది. దాదాపు బిగ్‌బాస్‌ హౌస్‌ను తమ ఆదీనంలో తీసుకున్న కౌశల్‌ ఆర్మీ.. ప్రతివారం ఒకరిని టార్గెట్‌ చేస్తూ బయటకు పంపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కౌశల్‌ పట్ల అనుచితంగా వ్యవహరించిన కిరీటీ, భానుశ్రీ, తేజస్వీ, బాబుగోగినేనిలు బయటకు వెళ్లేలా చేశారు. ఇన్ని రోజులు నామినేషన్‌లోకి రాకుండా తప్పించుకున్న దీప్తి సునయన ఈ వారం నామినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఈ అవకాశం ఎన్నో రోజులుగా చూస్తున్న వారు ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ ఈ సారి సునయన నిష్క్రమణ దారితీయనున్నాయా? అంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే. ఎందుకంటే అది బిగ్‌బాస్‌ ఏదైనా జరగొచ్చు! 

చదవండి: అసలు ఎలిమినేషన్‌ మజా ఈ వారమే!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top