పెళ్లి పిలుపులు!

Deepika Padukone - Ranveer Singh to Get Married in Italy - Sakshi

స్నేహితులను, బంధు మిత్రులను పెళ్లికి పిలుస్తున్నారట దీపికా పదుకోన్‌. బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌సింగ్‌తో ఆమె వివాహం ఈ ఏడాది నవంబర్‌లో ఇటలీలో జరగనుందన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్‌ 12–14 తేదీల మధ్యలో దీపికా–రణ్‌వీర్‌ల వివాహం ఫిక్స్‌ అయ్యిందని బీటౌన్‌ టాక్‌. ఆల్రెడీ వీరిద్దరూ సన్నిహితులకు పెళ్లి ఆహ్వానాలను కూడా పంపుతున్నారట. ఇటలీలో జరగనున్న ఈ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కి చాలా తక్కువ మందిని పిలిచి, ఆ నెక్ట్స్‌ ముంబైలో గ్రాండ్‌గా అందరికీ రిసెప్షన్‌ అరేంజ్‌ చేయాలని భావిస్తున్నారట దీపికా అండ్‌ రణ్‌వీర్‌.

ప్రస్తుతం తెలుగు ‘టెంపర్‌’ హిందీ రీమేక్‌ ‘సింబా’ సినిమాతో బిజీగా ఉన్నారు రణ్‌వీర్‌. ఈ ఏడాది సెప్టెంబర్‌ కల్లా ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్‌ చేస్తారు. ఆ తర్వాత ఈ వివాహం జరుగుతుందట. ‘పద్మావతి’ చిత్రం విడుదలై ఆర్నెళ్లు అయినా దీపికా పదుకోన్‌ నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌పై ఇంకా క్లారిటీ రాలేదు. తాజాగా ఆమె నీరజ్‌ గయవాన్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌కి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని బాలీవుడ్‌ టాక్‌. ఈ సినిమా దీపికా పెళ్లి తర్వాత సెట్స్‌పైకి వెళ్తుందట.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top