బాండ్ గర్ల్‌ రేసులో మన టాప్ హీరోయిన్లు‌! | Deepika Padukone, Priyanka Chopra in the race for the next Bond girl | Sakshi
Sakshi News home page

బాండ్ గర్ల్‌ రేసులో మన టాప్ హీరోయిన్లు‌!

May 10 2016 3:25 PM | Updated on Sep 3 2017 11:48 PM

బాండ్ గర్ల్‌ రేసులో మన టాప్ హీరోయిన్లు‌!

బాండ్ గర్ల్‌ రేసులో మన టాప్ హీరోయిన్లు‌!

ప్రస్తుతం దేశీ గర్ల్స్ దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా హవా ఇంటాబయటా కొనసాగుతోంది.

ప్రస్తుతం దేశీ గర్ల్స్ దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా హవా ఇంటాబయటా కొనసాగుతోంది. ప్రస్తుతం హాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ జోరు మీద ఉన్న భామలను మరో ఆఫర్‌ ఊరిస్తోంది.

ప్రస్తుతం దీపికా పదుకొనె 'ట్రిపుల్ ఎక్స్‌: ద రిటర్న్‌ ఆఫ్ జాండర్ కేగ్‌' హాలీవుడ్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉంది. మరోవైపు ప్రియాంక 'బేవాచ్‌' సినిమాలో విలన్ పాత్ర పోషిస్తోంది. ఈ రెండు సినిమాలతో ఈ బాలీవుడ్ బ్యూటీలు హాలీవుడ్ సినీ జనాలు దృష్టిని తమవైపు తిప్పుకోవడమే కాకుండా.. భారీ ఆఫర్లు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటు దీపికకు, అటు ప్రియాంకకు గట్టి సపోర్ట్‌ టీమ్స్ ఉండటంతో వీరికి ఆఫర్స్ కోసం పలు హాలీవుడ్ స్టూడియోలకు ప్రతిపాదనలు వెళుతున్నాయట.

ఈ క్రమంలో ప్రతిష్టాత్మకమైన జేమ్స్‌ బాండ్ తాజా చిత్రంలో హీరోయిన్‌ కోసం ఈ ఇద్దరు భామలు పోటీపడుతున్నట్టు తాజా కథనాలు పేర్కొంటున్నాయి. బాండ్ ప్రాంచైజీలో లేటెస్ట్‌ సినిమా 'స్పెక్టర్‌' 2015లో వచ్చింది. ఇందులో డానియెల్ క్రెగ్ బాండ్‌గా నటించాడు. కొత్తగా వచ్చే బాండ్ సినిమా కోసం ప్రస్తుతం కొత్త హీరోను అన్వేషిస్తున్నారు. డానియెల్ క్రెగ్‌ స్థానంలో కొత్త బాండ్‌ గా సరిపోయే వ్యక్తి కోసం ప్రస్తుతం చిత్రయూనిట్‌ వెతుకుతోంది. అదే సమయంలో కొత్ బాండ్ గర్ల్‌ కోసం వేట మొదలైందని, అందులో భాగంగా బాండ్ సరసన హాట్‌ హాట్ గా కనిపించే హీరోయిన్ కోసం దీపిక, ప్రియాంక పేర్లను కూడా పరిశీలిస్తున్నారని హాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికే హాలీవుడ్ లో భారీ ఆఫర్లపై కన్నేసిన ఆ ఇద్దరు దేశీగర్ల్స్‌లో ఎవరికీ ఈ ఆఫర్ వరిస్తుందో చూడాలి అంటున్నారు బాలీవుడ్ జనాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement