కాన్స్‌లో మన క్వీన్స్‌

Deepika Padukone, Priyanka Chopra and Elle Fanning lead best dressed - Sakshi

కాన్స్‌ ఫెస్టివల్‌ మళ్లీ తిరిగొచ్చింది. ఫ్రెంచ్‌ రివెరా నదీ తీరాన 72వ కాన్స్‌ చలన చిత్రోత్సవాలు మొదల య్యాయి. ప్రపంచవ్యాప్తంగా సినిమాలను సెలబ్రేట్‌ చేసుకునే పండగే కాన్స్‌. ఈ ఏడాది మే 14 నుంచి 25 వరకూ ఈ ఫెస్టివల్‌ జరుగుతుంది. సినిమాలతో పాటు  కాన్స్‌ మెయిన్‌ అట్రాక్షన్‌ ఎర్ర తివాచీపై కనిపించే పొడుగు గౌన్లు. అందుకే దీన్ని పొడుగు గౌన్ల పండగ అని కూడా అనుకోవచ్చు. ‘ఐ కేన్‌’ అంటూ  కాన్స్‌లో ప్రతీ హీరోయిన్‌ మీటర్ల కొద్దీ గౌన్లను ధరించడానికి రెడీ అవుతుంటారు.

ఈ ఏడాది కాన్స్‌లో ఎర్ర తివాచీపై పొడవు గౌన్లతో దీపికా పదుకోన్, కంగనా రనౌత్, ఐశ్వర్యారాయ్, సోనమ్‌ కపూర్‌ కనిపించడానికి రెడీ అవుతున్నారు.  తొలిసారి అందాల ప్రదర్శన చేయడానికి  ప్రియాంకా చోప్రా, డయానా పెంటీ, హీనా ఖాన్‌ సిద్దమయ్యారు. వీరిలో దీపికా, కంగనా, ప్రియాంకలు కాన్స్‌ ఎర్రతివాచీపై హోయలొలికించారు. దీపికా, ప్రియాంక గౌనుల్లో దర్శనమిస్తే కంగనా మాత్రం కంచి పట్టు చీరలో కనువిందు చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top