ఉల్లాసంగా... | "Davate Shadi ' up comining movie | Sakshi
Sakshi News home page

ఉల్లాసంగా...

Feb 17 2016 11:14 PM | Updated on Sep 3 2017 5:50 PM

ఉల్లాసంగా...

ఉల్లాసంగా...

సౌదాగర్, మైనే ప్యార్ కియా, హమ్ ఆప్ కే హై కౌన్’, రీసెంట్‌గా‘పేమ్ రతన్ ధన్ పాయో’...

‘సౌదాగర్, మైనే ప్యార్ కియా, హమ్ ఆప్ కే హై కౌన్’, రీసెంట్‌గా ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ లాంటి ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ అందించిన రాజశ్రీ ప్రొడక్షన్స్ తొలిసారి  ‘దావతే షాదీ’ అనే హైదరాబాదీ చిత్రాన్ని విడుదల చేస్తోంది. సాజిద్ ఖాన్, మస్త్ అలీ, ఫిరోజ్ ఖాన్, మాధవి, మనీషా, కావ్య ప్రధాన పాత్రల్లో సయ్యద్ హుస్సేన్ దర్శకత్వంలో యాబా ప్రొడక్షన్స్ పతాకంపై సమీ ఉల్లా ఫయాజ్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 4న విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ-  ‘‘అగ్రనిర్మాణ సంస్థ రాజశ్రీ ప్రొడక్షన్స్ వారు ఈ చిత్రం విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఉల్లాసభరితమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. డబుల్ మీనింగ్ డైలాగులు, అశ్లీలతకు తావు లేకుండా అన్నివర్గాల ప్రేక్షకులు చూసేలా తెరకెక్కించాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎంజీకే ప్రవీణ్.

Advertisement
 
Advertisement
Advertisement