పునర్నిర్మాణానికి ఆ రెండు చిత్రాలు | Sakshi
Sakshi News home page

పునర్నిర్మాణానికి ఆ రెండు చిత్రాలు

Published Mon, Jul 7 2014 12:04 AM

పునర్నిర్మాణానికి ఆ రెండు చిత్రాలు

 గతంలో విజయం సాధించిన చిత్రాలు పునర్ నిర్మాణం ఆ మధ్య జోరుగా సాగి ఆగిపోయింది. తిల్లుముల్లు చిత్రంతో ఆగిన ఆ ట్రెండ్ త్వరలో మళ్లీ మొదలు కానుంది. ఇంతకుముందు కె.భాగ్యరాజా హీరోగా స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం డార్లింగ్ డార్లింగ్. పూర్ణిమ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సుమన్ ముఖ్యపాత్ర పోషించారు. 1982లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. చిత్రంలోని పాటలన్నీ విశేష ప్రజాదరణ పొందాయి. ఆ చిత్రం రీమేక్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. భాగ్యరాజ పాత్రలో ఆయన తనయుడు శాంతను నటించనున్నారు.
 
 నిర్మాత షణ్ముగరాజన్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఆయనే రీమేక్ చేయనున్నారు. హీరోయిన్ ఎవరన్నది నిర్ణయం కాని ఈ చిత్రానికి అదియమాన్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. కాగా 1994లో తెరపైకొచ్చి మంచి విజయాన్ని సాధించిన చిత్రం ఇందు.  నటుడు ప్రభుదేవా, అప్పటి క్రేజీ హీరోయిన్ రోజా జంటగా నటించిన ఈ చిత్రానికి పవిత్రన్ దర్శకుడు.  అలాంటి చిత్రం తాజాగా మరోసారి తెరకెక్కడానికి రెడీ అవుతోంది. ఈ చిత్ర తారాగణం ఎంపిక జరుగుతోంది. ఈ రెండు చిత్రాలు ప్రజాదరణ పొందితే మరిన్ని తెరకెక్కే అవకాశం ఉంటుంది.
 

Advertisement
 
Advertisement
 
Advertisement