పావగడలో ‘దండుపాళ్యం’ | Dandupalyam Shooting In Pavagada Karnataka | Sakshi
Sakshi News home page

పావగడలో ‘దండుపాళ్యం’ షూటింగ్‌

May 21 2018 7:58 AM | Updated on May 21 2018 7:58 AM

Dandupalyam Shooting In Pavagada Karnataka - Sakshi

ఒక సన్నివేశంలో నడిచి వస్తున్న బెనర్జీతో పాటు నటీ నటులు

కర్ణాటక, పావగడ: పళవల్లి, నాగలమడక గ్రామాల పరిసర ప్రాంతాల్లో దండుపాళ్యం చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తెలుగు, కన్నడ, తమిళ, మళయాల, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్న దండుపాళ్యం చిత్రం కన్నడలో విజయవంతమైన దండుపాళ్యం 1,2,3లకు కొనసాగింపుగా ఉంటుందని చిత్ర నిర్మాత వెంకట్‌ తెలిపారు. స్థానిక రాయల్‌ హెరిటేజ్‌ రిసార్ట్‌లో చిత్ర యూనిట్‌ ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రైం, థ్రిల్లర్‌ కథాంశాలతో కూడిన దండుపాళ్యం చిత్రం షూటింగ్‌కు అనువైన ప్రాంతంగా పావగడను గుర్తించి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు.

ఈ చిత్రంలో తెలుగు విలక్షణ నటుడు బెనర్జీ మాస్టర్‌ మైండ్‌గా ప్రధాన భూమిక పోషిస్తున్నారన్నారు. చిత్ర దర్శకుడు కేటీ నాయక్‌ మాట్లాడుతూ ఈ సినిమాకు బెనర్జి ఎనర్జీ అని చమత్కరించారు. బెనర్జి మాట్లాడుతూ బాలివుడ్, హాలివుడ్‌  సినిమాల షూటింగ్‌లకు పావగడలోని లొకేషన్లు బాగున్నాయన్నారు. సుమన్‌ రంగనాథ్, రాక్‌లైన్‌ సుధాకర్, సంజీవ్‌ కుమార్, బులెట్‌ సోము, అరుణ్‌ బచ్చన్, విఠల్‌ రంగాయన,  స్నేహనాయర్, రిచా శాస్త్రి ముఖ్య తారాగణం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement