సెట్‌లో... టైమ్ బాంబ్ | Correct Time Shooting Spot in hansika motwani | Sakshi
Sakshi News home page

సెట్‌లో... టైమ్ బాంబ్

Published Thu, May 19 2016 1:28 AM | Last Updated on Mon, Sep 4 2017 12:23 AM

సెట్‌లో... టైమ్ బాంబ్

 ‘దేశముదురు’ ద్వారా తెలుగు తెరకు పరిచయమై, ఇక్కడ బాగానే సినిమాలు చేశారు హన్సిక. అయితే. తెలుగులోకన్నా ఇప్పుడు తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు. అక్కడ హన్సిక కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా ఉంది. చిన్న ఖుష్బూ అని తమిళ పరిశ్రమ, ప్రేక్షకులు హన్సికను ముద్దుగా పిలుస్తుంటారు. ఆమెకు ఇంకో పేరు కూడా ఉంది.
 
  ఆ విషయం గురించి హన్సిక మాట్లాడుతూ - ‘‘నేను షూటింగ్‌కి కరెక్ట్ టైమ్‌కి వెళిపోతాను. ఏడు గంటలంటే ఓ పది నిమిషాలు ముందే లొకేషన్‌లో ఉంటాను. అందుకే అందరూ నన్ను ‘టైమ్ బాంబ్’ అని పిలుస్తారు’’ అని చెప్పారు. పంక్చువాల్టీని ఇష్టపడే హన్సిక ఇప్పుడా విషయంలో కొంచెం మారాలనుకుంటున్నారు. ‘‘నేను ముందు లొకేషన్‌కి వెళిపోతాను. కానీ, ఆలస్యంగా వచ్చేవాళ్ల వల్ల అనుకున్న సమయానికి షూటింగ్ స్టార్ట్ కాదు. దాంతో నేను ముందు వెళ్లినా ప్రయోజనం ఉండదు.
 
  అందుకే, కొంచెం మారాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. కానీ, నావల్ల కావడం లేదు’’ అని హన్సిక పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో హన్సిక యాక్టివ్‌గా ఉంటారు. ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు తాను చేస్తున్న చిత్రాల వివరాలు తెలియజేస్తుంటారు. అప్పుడప్పుడూ అభిమానులతో చిట్ చాట్ చేస్తుంటారు. హన్సిక ట్విట్టర్‌ని ఫాలో అయ్యేవారి సంఖ్య ఇటీవలే 20 లక్షలకు చేరుకుంది. ఈ సందర్భంగా తన అభిమానులకు ఈ బ్యూటీ ధన్యవాదాలు తెలిపారు.
 

Advertisement
Advertisement
Advertisement