క్లింట్ ఈస్ట్‌వుడ్ ఇక ‘సింగిల్’ | Clint Eastwood And Dina Eastwood's Divorce Is Finalized | Sakshi
Sakshi News home page

క్లింట్ ఈస్ట్‌వుడ్ ఇక ‘సింగిల్’

Dec 25 2014 10:50 PM | Updated on Sep 2 2017 6:44 PM

క్లింట్ ఈస్ట్‌వుడ్ ఇక ‘సింగిల్’

క్లింట్ ఈస్ట్‌వుడ్ ఇక ‘సింగిల్’

ప్రముఖ హాలీవుడ్ నటుడు, దర్శకుడు క్లింట్ ఈస్ట్‌వుడ్ ఇప్పుడు మళ్ళీ ‘సింగిల్’ అయిపోయారు.

 ప్రముఖ హాలీవుడ్ నటుడు, దర్శకుడు క్లింట్ ఈస్ట్‌వుడ్ ఇప్పుడు మళ్ళీ ‘సింగిల్’ అయిపోయారు. రెండో భార్య దినా ఈస్ట్‌వుడ్ నుంచి ఇటీవలే కోర్టులో విడాకులు మంజూరవడంతో, ఆయన అధికారికంగా ఇప్పుడు ‘బ్యాచ్‌లర్’ అయ్యారు. దినా, క్లింట్ ఈస్ట్‌వుడ్‌ల పదిహేడేళ్ళ వివాహబంధం గత ఏడాది ఆగస్టులో చిక్కుల్లోపడింది. సెప్టెంబర్‌లో విడాకులకు దరఖాస్తు చేశారు. అప్పటి నుంచే విడి విడిగా ఉంటున్న ఈ జంట ఇప్పుడు అధికారికంగా విడిపోయింది. దినా, క్లింట్ ఈస్ట్‌వుడ్‌లకు 18 ఏళ్ళ కుమార్తె ఉంది.
 
 వాస్తవ సంఘటనల ఆధారంగా ఇరాక్ యుద్ధంపై స్వీయ దర్శకత్వంలో తీసిన తన తాజా చిత్రం ‘అమెరికన్ స్నైపర్’ ద్వారా ఇప్పటికే అవార్డు వర్గాల్లో చర్చనీయాంశమైన క్లింట్ ఇప్పుడీ తాజా వార్తతో మరోసారి అందరి దృష్టిలో పడ్డారు. గతంలో ఆస్కార్ అవార్డు కూడా గెల్చిన క్లింట్ మాత్రం తన వ్యక్తిగత జీవితంపై పెదవి విప్పడం లేదు. నిజానికి, ఆయనకు విడాకులు కొత్తేమీ కాదు. మొదటి భార్య మ్యాగీ జాన్సన్‌తో 30 ఏళ్ళ వైవాహిక జీవితం తరువాత 1984లో ఆమె నుంచి క్లింట్ విడాకులు పొందారు. మొదటి వివాహం ద్వారా ఆయనకు కలిగిన స్కాట్ ఈస్ట్‌వుడ్, అలీసన్ ఈస్ట్‌వుడ్‌లు కూడా సినీ నటనలోనే ఉండడం విశేషం. ఇంతకీ, క్లింట్ ముచ్చటగా మూడో పెళ్ళి చేసుకుంటారా? కాస్తంత ఆగి చూడాలి.  
 

Advertisement

పోల్

Advertisement