రికవరీ బాబ్జీ కహానీ! | chuttalabbayi full action movie | Sakshi
Sakshi News home page

రికవరీ బాబ్జీ కహానీ!

Mar 31 2016 11:31 PM | Updated on Sep 3 2017 8:57 PM

రికవరీ బాబ్జీ కహానీ!

రికవరీ బాబ్జీ కహానీ!

కుటుంబ భావోద్వేగాలతో వినోదభరితంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. మన చుట్టూ ఉండే వారందరినీ కలుపుకొని పోయే రికవరీ బాబ్జీ

 ‘‘కుటుంబ భావోద్వేగాలతో వినోదభరితంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. మన చుట్టూ ఉండే వారందరినీ కలుపుకొని పోయే రికవరీ బాబ్జీ పాత్రలో నటిస్తున్నా. జూన్ మొదటి వారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని హీరో ఆది పేర్కొన్నారు. ఆది, నమిత, యామిని జంటగా రామ్ తాళ్లూరి సమర్పణలో వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి నిర్మిస్తున్న చిత్రం ‘చుట్టాలబ్బాయి’.
 
  ఈ సినిమా షూటింగ్ ఎనభై శాతం పూర్తయింది. ఈ సందర్భంగా వీరభద్రమ్ మాట్లాడుతూ- ‘‘ ‘పూల రంగడు’ చిత్రకథ మొదట ఆదికే వినిపించా. కానీ, డేట్ల ప్రాబ్లమ్స్ వల్ల ఆదితో చేయలేకపోయా. ‘చుట్టాలబ్బాయి’ కథ సాయికుమార్ గారికి, ఆదికి నచ్చి వెంటనే ఓకే చెప్పేశారు. ఇది పూర్తిగా యాక్షన్ నిండిన ఎంటర్ టైనర్’’ అని దర్శకుడు తెలిపారు. ‘‘సినిమా ప్రారంభం నుంచి పూర్తయ్యేవరకు ప్రేక్షకులు నవ్వుకుంటూనే ఉంటారు’’ అని నిర్మాత అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement