రేసు నుంచి తప్పుకున్న ఆది | chuttalabbai postponed to August 19 | Sakshi
Sakshi News home page

రేసు నుంచి తప్పుకున్న ఆది

Jul 31 2016 8:40 AM | Updated on Sep 4 2017 7:13 AM

రేసు నుంచి తప్పుకున్న ఆది

రేసు నుంచి తప్పుకున్న ఆది

మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో ఆది.. భారీ పోటీలో సినిమాను రిలీజ్ చేయడానికి ఇంట్రస్ట్ చూపించటం లేదు. అందుకే ముందుగా ఆగస్టు 5న తన లేటెస్ట్ మూవీ చుట్టాలబ్బాయి...

మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో ఆది.. భారీ పోటీలో సినిమాను రిలీజ్ చేయడానికి ఇంట్రస్ట్ చూపించటం లేదు. అందుకే ముందుగా ఆగస్టు 5న తన లేటెస్ట్ మూవీ చుట్టాలబ్బాయి రిలీజ్ ప్లాన్ చేసినా.. ఇప్పుడు రేసు నుంచి తప్పకున్నాడు. అదే రోజు మరో రెండు సినిమాలు రిలీజ్ అవుతుండటంతో రిస్క్ ఎందుకన్న ఉద్దేశంతో తన సినిమాను వాయిదా వేశాడు.

ఆగస్ట్ 5న రిలీజ్ అవుతున్న సినిమాల్లో మంచి అంచనాలు ఉన్న సినిమా శ్రీరస్తు శుభమస్తు.. ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో అల్లు వారబ్బాయి శిరీష్..  పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడు చందశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన మనమంతా సినిమా కూడా అదే రోజు రిలీజ్ అవుతోంది.

మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్  తొలి సారిగా చేస్తున్న తెలుగు సినిమా కావటంతో ఈ సినిమాపై కూడా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ రెండు సినిమాలతో పోటి పడటం కన్నా సేఫ్ టైంలో సినిమా రిలీజ్ చేసుకోవటం బెటర్ అని ఫీల్ అవుతున్నాడు ఆది. అందుకే చుట్టాలబ్బాయి సినిమాను ఆగస్ట్ 19న తీరిగ్గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement