చిరంజీవి ఇంట్లో మొదలైన పెళ్లి సందడి | Chiranjeevi's Younger Daughter Srija's Wedding Preparation Begins | Sakshi
Sakshi News home page

చిరంజీవి ఇంట్లో మొదలైన పెళ్లి సందడి

Feb 12 2016 7:00 PM | Updated on Sep 3 2017 5:31 PM

పెళ్లి పనుల్లో శ్రీమతి సురేఖతో కలసి చిరంజీవి

పెళ్లి పనుల్లో శ్రీమతి సురేఖతో కలసి చిరంజీవి

ప్రముఖ సినీనటుడు, కాంగ్రెస్ నాయకుడు చిరంజీవి ఇంట్టో పెళ్లి సందడి మొదలైంది. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వివాహం త్వరలో జరుగనుండగా గురువారం 'పసుపు కుంకుమ' వేడుకతో పెళ్లి పనులు మొదలుపెట్టారు.

చిరంజీవి రెండో కుమార్తె శ్రీజకు మళ్లీ వివాహం ఖరారైందనే వార్త ఇటీవల కొద్దిరోజులుగా ప్రచారమవుతోంది. దీని గురించి చిరంజీవి కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా ఇప్పటి దాకా రాలేదు. గతంలో శ్రీజ ప్రేమ వివాహం, తదనంతర పరిణామాల్లో విడాకులు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కానీ, చిరంజీవి ఇంట పెళ్లి సందడి మొదలైందని భోగట్టా. వివాహ వేడుకలకు నాందిగా చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ కలిసి పసుపు దంచే కార్యక్రమం మొదలుపెట్టినట్లుగా సామాజిక మాధ్యమంలో హల్‌చల్ చేస్తున్న ఓ ఫొటో స్పష్టం చేసింది.

కాగా, సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం వరుడు తిరుపతి సమీప ప్రాంతానికి చెందిన కుర్రాడు. చిరంజీవి సతీమణి సురేఖకు సన్నిహితులైనవారి కుమారుడు. ఇరు కుటుంబా లకూ ఎప్పటి నుంచో సాన్నిహిత్యం ఉంది. ఈ ఫిబ్రవరి నెలాఖరున (25వ తేదీ ప్రాంతంలో) పెళ్లి జరగనుందట. ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా నిరాడంబరంగా ఈ పెళ్ళి జరపాలని వధూ వరుల కుటుంబాలు నిర్ణయించాయి. పెళ్ళి కూడా హైదరాబాద్‌లో కాక, వేరే చోట జరపనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement